బిగ్ ట్విస్ట్ : వాణి శ్రీ కొడుకు మృతి.. గుండెపోటు కాదు ఆత్మహత్య!
టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు అభినయ్ వెంకటేష్ కార్తీక్ (36) మృతి చెందడంతో వారి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మొదటగా గుండెపోటుతో మృతి చెందాడని వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తరువాత పోలీసుల దర్యాప్తు గడుస్తున్నా కొద్దీ కొత్త కొత్త ట్విస్ట్‌లు బయటపడ్డాయి. అభినయ్‌ది సహజ మరణం కాదని, ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు నిర్దారించినట్టు తెలుస్తోంది. అసలు ఏం జరిగిందో ఓ సారి చూద్దాం..

నిద్రలో గుండెపోటు..
ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వెంకటేష్.. చెంగల్‌పట్టు జిల్లా తిరుక్కలింకుండ్రంలోని తమ ఫాంహౌస్‌లోనే ఉంటున్నాడు. అప్పటి వరకు బాగానే ఉండి.. తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేష్ నిద్రిస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయాడని సన్నిహితులు మొదటగా తెలిపారు.

ఆలస్యంగా వెలుగులోకి..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు ఇది సహజ మరణం కాదని నిర్దారణ అయింది. ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

వ్యక్తిగత సమస్యలే..
ఇటీవలె తిరుక్కలింకుండ్రంలో ఓ బంగ్లాను కొనుగోలు చేశాడని, లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయన అక్కడే ఉంటున్నాడని తెలుస్తోంది. అయితే వ్యక్తిగత సమస్యల కారణంగా కొన్ని రోజులుగా ముభావంగా ఉంటున్నాడని అక్కడి వారు చెబుతున్నారు.
Recommended Video

ఇంకా స్పష్టత లేదు..
అయితే అభినయ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో డాక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు (4), కుమార్తె ఉన్నారు. ఆయన భార్య కూడా వైద్యురాలే.


Click it and Unblock the Notifications











