బ్రేకింగ్ న్యూస్ : సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం.. ఏం జరిగిందంటే

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన వాణీ శ్రీ.. చెన్నైలోనే సెటిలైంది. ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న వాణీ శ్రీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంది. అయితే ఆమె కుమారుడు అభినయ్‌ వెంకటేష్‌ కార్తీక్‌ (36) నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందడంతో విషాదచాయలు అలుముకున్నాయి. అసలు ఇంతకి ఏం జరిగిందంటే..

నిద్రలో గుండెపోటు..

నిద్రలో గుండెపోటు..

ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వెంకటేష్.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారు. అప్పటి వరకు బాగానే ఉండి.. తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం హటాత్తుగా మరణించారని తెలుస్తోంది. నిద్రిస్తుండగా గుండెపోటు రావడంతో చనిపోయాడని సన్నిహితులు తెలిపారు.

 ఆలస్యంగా వెలుగులోకి..

ఆలస్యంగా వెలుగులోకి..

అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Recommended Video

Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
చిత్రసీమ దిగ్భ్రాంతి..

చిత్రసీమ దిగ్భ్రాంతి..

అభినయ్ మృతితో చిత్రపరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాణిశ్రీకి ఒక కుమార్తె అనుపమ ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X