రాజకీయాల్లోకి రాకండి.. అలా చూడలేం.. రజనీకాంత్ ఆరోగ్యంపై వనిత విజయ్ కుమార్

రజనీకాంత్ ఆరోగ్యంపై అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడనే వార్తలు ఒక్కసారిగా జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. అసలే అన్నాత్తె షూటింగ్‌లో కరోనా కలకలం, పైగా రజనీ వయసురీత్యా పొంచిఉన్న ప్రమాదంపై అభిమానులు ఆందోళన చెందారు. అయితే రజనీ ఆరోగ్యం స్థిమితంగానే ఉందని వైద్యుల ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కరోనా కలకలం..

కరోనా కలకలం..

రజనీకాంత్ శివ కాంబోలో వస్తోన్న అన్నాత్తె షూటింగ్‌లో కరోనా బీభత్సం సృష్టించింది. మూవీ యూనిట్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో దాదాపు ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో రజనీకాంత్‌కు పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ అనే వచ్చింది. అప్పటి నుంచి రజనీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

రక్తపోటు సమస్యలు..

రక్తపోటు సమస్యలు..

రజనీకాంత్ ఈ రోజు ఉదయం హాస్పిటల్‌లొ జాయిన్ అయ్యారని కరోనా లక్షణాలేవీ లేకపోయినా కూడా బీపీ ఫ్లక్ఛువేట్ అవుతోందని వైద్యులు ప్రకటించారు. రక్త పోటు తప్పా రజనీకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని అపోలో హాస్పిటల్స్ ప్రకటించింది. దీంతో అందరూ శాంతించారు.

Recommended Video

Rajinikanth Hospitalised In Hyderabad Appollo Hospital | Rajini Health Update | Filmibeat Telugu
అందరూ స్పందించారు..

అందరూ స్పందించారు..

రజనీ ఆరోగ్యంపై టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులందరూ స్పందించారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అయి ఓ నోట్ విడుదల చేశాడు. ప్రముఖ కథానాయకులు రజనీకాంత్ గారు అస్వస్థతతో హైద్రాబాద్‌లోని ఆసుపత్రిలో చేరినట్టు తెలిసి బాధపడ్డాను. కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చింది. మనో ధైర్యం మెండుగా ఉన్న రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని కోరారు.

తాజాగా వనిత అలా..

తాజాగా వనిత అలా..

తాజాగా వనిత విజయ్ కుమార్ స్పందించింది. రజనీకాంత్ వయురీత్యా రాజకీయాల్లోకి రావొద్దని, బాధపడొద్దని వనిత పేర్కొంది. అంకుల్ రాజకీయాల్లోకి రాకండి అంటూ ధీనంగా ప్రార్ధించింది. రజనీకాంత్ అంకుల్ బాగుండాలి.. ఆయనకు శక్తినివ్వాలని ఆ దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను.. ఈ ఏడాది గడిచేందుకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి.. ఆ తరువాత అన్నీ మంచి రోజులే.. మీరు రాజకీయాల్లో రావడం, బాధపడటం చూడలేం మాకు నచ్చదు అంకుల్.. మీరు మాతోనే ఇంకా ఉండాలి.. అంటూ వనిత ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X