ఫ్యాన్‌గా నిరాశ చెందాను కానీ.. రజనీకాంత్ నిర్ణయంపై వనిత విజయ్ కుమార్ ట్వీట్ వైరల్

రజనీకాంత్ ఆరోగ్యం స్థిమితంగా లేకపోవడం, రక్తపోటులో హెచ్చుతగ్గులు, ఇది వరకు చేసిన కిడ్నీ మార్పిడి కూడా ప్రభావం చూపెడుతోందని వైద్యులు సూచించారు. వారం రోజులు రజనీ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. కరోనా సోకే ప్రమాదం ఉన్న చోటుకు రజనీ దూరంగా ఉండాలని హెచ్చరించారు. మొత్తానికి రజనీకాంత్ నేడు ఓ సంచలనమైన ప్రకటన చేశాడు. ఇకపై రాజకీయాలకు దూరమంటూ ప్రకటించేశాడు.

పార్టీ పెట్టడం లేదు..

పార్టీ పెట్టడం లేదు..

నా ఆరోగ్య సమస్యల వల్ల సన్ పిక్చర్స్ కళానిధి మారన్ చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అయింది.. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు.. ఎంతో నష్టం వచ్చింది..అదంతా కేవలం నా ఆరోగ్యం వల్లే వచ్చింది. ఇది నాకు దేవుడి హెచ్చరికలా అనిపించింది.. నా వల్ల మిగతా వారంతా సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు.. అందుకే నేను పార్టీ పెట్టడం లేదు.. రాజకీయాల్లోకి రావడం లేదు..అంటూ రజనీ పేర్కొన్నాడు.

భిన్నాభిప్రాయాలు..

భిన్నాభిప్రాయాలు..

రజనీకాంత్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొందరు మాత్రం మంచి నిర్ణయమంటూ సమర్థిస్తుంటే.. ఇంకొందరు మాత్రం పార్టీ మొదలుపెట్టక ముందే మూసేశాడని సెటైర్లు వేస్తున్నారు. వనిత విజయ్ కుమార్ తాజాగా రజనీ ప్రకటనపై స్పందించింది.

అప్పుడు అలా..

అప్పుడు అలా..

రజనీకాంత్ ఆరోగ్యం బాగా లేకపోవడం హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడంపై ఆ మధ్య వనిత విజయ్ కుమార్ స్పందించింది. వయురీత్యా రాజకీయాల్లోకి రావొద్దని, బాధపడొద్దని అంకుల్ రాజకీయాల్లోకి రాకండి అంటూ ధీనంగా ప్రార్ధించింది వనిత.

ఫ్యాన్స్‌గా మీ నిర్ణయం..

ఫ్యాన్స్‌గా మీ నిర్ణయం..

అంకుల్ తీసుకున్న నిర్ణయం మంచిదంటూ రజనీకాంత్ ట్వీట్‌పై వనిత విజయ్ కుమార్ కామెంట్ చేసింది. ఫ్యాన్స్‌గా మీరు మీ నిర్ణయంతో మమ్మల్ని బాధపెట్టారు. కానీ కుటుంబ సభ్యులుగా మీరు తీసుకున్న నిర్ణయం సరైందని అనిపిస్తోంది. ఇది దేవుడి సందేశం.. దేవుడి ప్రణాళికలను ఫాలో అవుదాం.. అన్నింటి కంటే మన ఆరోగ్యమే ముఖ్యం అంటూ వనిత చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X