twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెప్టెంబర్ 30న ‘వంకాయ్ ఫ్రై’

    By Bojja Kumar
    |

    Vankaya Fry
    సన్ డైరెక్ట్ డిటిహెచ్ యాడ్ల‌లో అందరినీ ఆకట్టుకున్న సుమిత్ అరోరా హీరోగా, అనుస్మృతి హరోయిన్‌గా పరిచయం చేస్తూ ఈశ్వరి సినీ మీడియా పతాకంపై బి.సి.ఎం.రెడ్డి రూపొందిస్తున్న చిత్రం వంకాయ్ ఫ్రై. ఈ చిత్రానికి దర్శకుడిగా చంద్రమౌళి పరిచయం అవుతున్నారు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యూ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ సిద్ధమైంది. సెప్టెంబర్ 30న సినిమాను విడుదల చేస్తున్నారు.

    ఈ సందర్భంగా దర్శకుడు చంద్రమౌళి మాట్లాడుతూ.. ' వంకాయ్ ఫ్రై కథని చాలా ఇష్టపడి రాసుకున్నాను, పూర్తి వినోదాత్మకంగా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము, కథకి తగ్గట్టుగానే ఈ చిత్రంలో పాత్రలుంటాయి. వాటికి తగ్గట్టుగానే నటీనటుల్ని ఎంపిక చేశాం, ఈ చిత్రం తో సన్ నెట్ వర్క్ యాడ్ ద్వారా ప్రేక్షఃకుల్లో అభిమానాన్ని సంపాదించుకున్న సుమిత్ అరోరాని హీరోగా పరిచయం చేస్తున్నాం. సుమిత్‌ని చూస్తేనే అందరూ నవ్వుతారు. అంత కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తన ఫేస్ లో కనబరిచాడు. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం నటించారన్నారు.

    ఈ చిత్రంలో ఇంకా ఎం.ఎస్. నారాయణ, వేణుమాధవ్, కాదంబరి కిరణ్, ప్రభాస్ శీను, హర్షవర్ధన్, పిళ్లై ప్రసాద్, చిత్రం శ్రీను తదితరులు నటించారు. సంగీతం : ఎం.ఎం. శ్రీలేఖ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా : చక్రి, రచన : వి. విక్రమ్ రాజు, నిర్మాత : బిసిఎం రెడ్డి, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : చంద్రమౌళి

    English summary
    Sumith arora and Anusmruthi Starred 'Vankai Frai' releasing on Sep 30. This movie directed by Chandramouli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X