బాల్యంలోనే లైంగిక వేధింపులు... అందరి ముందు బయట పెట్టిన స్టార్ కిడ్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు ఎలాంటి అడ్డంకులు ఉండవు అని, బ్యాగ్రౌండ్ ఉండడం వల్ల కావలసినన్ని అవకాశాలు దక్కుతాయని అనుకుంటారు. కానీ స్టార్ కిడ్స్ కి కూడా లైంగిక వేధింపులు వంటి చేదు అనుభవాలు తప్పవు అని అప్పుడప్పుడు బయటపడే కొన్ని సంఘటనల వల్ల తెలుస్తుంది. ఓ స్టార్ కిడ్ తను చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ అందరి ముందు బయట పెట్టేసింది. ఆ స్టార్ కిడ్ ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం కూడా తెలుసుకుందాం పదండి.
వరలక్ష్మి శరత్ కుమార్ స్టార్ కిడ్ గా తమిళ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టింది. కెరీర్ మొదట్లో పెద్దగా మెప్పించలేకపోయినా, రాను రానూ తన యాక్టింగ్ స్కిల్స్ ను మెరుగుపరుచుకొని కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.

రీసెంట్ గా హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శబరి అనే మూవీతో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి అనిల్ దర్శకత్వం వహించగా, మహేంద్ర నాథ్ నిర్మాతగా వ్యవహరించారు. మే 3న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి శరత్ కుమార్ తన చిన్నతనం గురించి షాకింగ్ విషయాలను వెల్లడించింది.
వరలక్ష్మి తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ తాను బాల్యంలోనే లైంగిక వేధింపులకు గురయ్యాను అనే విషయాన్ని బయట పెట్టి ఊహించని షాక్ ఇచ్చింది. తన జీవితంలో మర్చిపోలేని గాయం అంటే అదేనని చెప్తూ ఈ రోజుల్లో జనాల మానసిక పరిస్థితి ఎలా ఉందో వివరించింది.

ఈరోజుల్లో చాలామంది తమ మానసిక స్థితి గురించి రిలేటివ్స్ కు, ఫ్రెండ్స్ కు చెప్పుకోవడానికి భయపడుతున్నారని, కాబట్టి ప్రతి ఒక్కరికి థెరపిస్ట్ ఉంటే మంచిదని సలహా ఇచ్చింది. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్య గురించి మాట్లాడితే మనల్ని తిరిగి జడ్జ్ చేస్తారనీ చెప్పుకొచ్చింది.
అదే థెరపిస్ట్ తో మాట్లాడితే వాళ్ళు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారని, కాబట్టి సమస్య ఏదైనా థెరపిస్టు దగ్గరికి వెళ్లడం మంచిదని చెప్పుకొచ్చింది వరలక్ష్మి. అయితే ఒక స్టార్ కిడ్ ఇలా తనకు చిన్నప్పుడే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అని చెప్పడం సంచలనంగా మారింది. ఆమె తాను నటించిన శబరి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిన్నప్పుడే లైంగిక వేధింపులకు గురయ్యాను అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఇక రీసెంట్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే. మార్చ్ 1న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్ దేవ్ తో జరిగింది. వీళ్ళిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్ షిప్ ను మైంటైన్ చేసి, చివరికి ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో వైవాహిక బంధం లోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యారు. ఇక పెళ్లిని కూడా ఇదే ఏడాది చేసుకుంటానని రీసెంట్ గా ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది వరలక్ష్మి.


Click it and Unblock the Notifications











