ప్రభాస్ కోసం పడిచస్తున్న స్టార్ హీరో కూతురు.. క్రేజీ డాటర్ ఎవరో తెలుసా?

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఒక్కసారిగా సినీ ఐకాన్‌గా మారిపోయారు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో సినీ ప్రముఖుల దృష్టి యంగ్ రెబల్ ‌స్టార్‌పై పడింది. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతల క

By Rajababu

బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఒక్కసారిగా సినీ ఐకాన్‌గా మారిపోయారు. బాలీవుడ్‌తోపాటు పలు భాషల్లో సినీ ప్రముఖుల దృష్టి యంగ్ రెబల్ ‌స్టార్‌పై పడింది. ప్రభాస్‌తో ఒక్క సినిమాలోనైనా నటింప చేయాలనే సినీ నిర్మాతల క్యూ భారీగానే పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి వెల్లువలా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అయినా ప్రభాస్ చెక్కుచెదర్లేదు. ఇదంతా నాణానికి మరో వైపు.. ఇక అసలు విషయానికి వస్తే గతంలో ప్రభాస్‌తో నటించడానికి ముఖం చాటేసినా హీరోయిన్లు ఇప్పుడు ఆయన నటించాలని తహతహలాడుతుండటం గమనార్హం. తాజాగా తమిళ స్టార్ శరత్ కుమార్ కూతురు కూడా ఈ జాబితాలో చేరింది.

ప్రభాస్ క్రేజ్ చూసి..

ప్రభాస్ క్రేజ్ చూసి..

బాహుబలి రిలీజ్‌కు ముందు ప్రభాస్‌తో నటించడానికి ఆసక్తి చూపని బాలీవుడ్ తారల్లో శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ లాంటి ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ను చూసి తప్పులో కాలేశామని రియలైజ్ అయ్యారు.

సాహోలో శ్రద్ధాకపూర్

సాహోలో శ్రద్ధాకపూర్

మళ్లీ అదృష్టం కలిసి రావడంతో ప్రస్తుతం శ్రద్ధా కపూర్ సాహోలో నటించే అవకాశాన్ని దక్కించుకొన్నది. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

కొత్తగా శరత్ కుమార్ కూతురు

కొత్తగా శరత్ కుమార్ కూతురు

ఇక ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ల జాబితాలో తాజాగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ చేరింది. తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కోలివుడ్‌లోకి ప్రవేశించింది. ఆమె నటించిన ఓ చిత్రం తెలుగులోకి అనువాదం అయింది కానీ అంతగా పేరు తెచ్చి పెట్టలేదు.

ప్రభాస్‌తో నటించాలని ఉంది..

ప్రభాస్‌తో నటించాలని ఉంది..

అయితే ఇటీవల వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదిలో ప్రభాస్‌తో నటించాలని ఉంది. బాహుబలి ప్రభాస్‌తో నటించాలని ఉంది. బాహుబలి తర్వాత అతని క్రేజ్ చూసి ఫ్యాన్‌గా మారిపోయాను అని చెప్పింది.

శక్తిలో వరలక్ష్మీ శరత్ కుమార్

శక్తిలో వరలక్ష్మీ శరత్ కుమార్

ప్రభాస్‌తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఆయన పక్కన నటించే ఛాన్స్ వస్తే అవకాశం వదులుకోను అని వరలక్ష్మీ పేర్కొన్నది. వరలక్ష్మీ తెలుగులో శక్తి అనే చిత్రంలో నటించనున్నది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X