అల్లరి నరేష్‌తో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి
హైదరాబాద్: తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తెలుగు తెరకు పరిచయం కాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఎంట్రీ ఖరారైంది. టాలీవుడ్ కామెడీ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలతో దూసుకెలుతున్న అల్లరి నరేష్ సరసన వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైంది.
ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయి నటన, అందం విషయంలో మంచి మార్కులే కొట్టేసింది వరలక్ష్మి. ఈ నేపథ్యంలో పలువురు దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నారు. అల్లరి నరేష్ తో ఆమె చేయబోయే సినిమాకు సాయి కిషోర్ దర్శకత్వం వహించబోతున్నాడు.
సాయి కిషోర్ ఇది వరకు శ్రీను వైట్ల వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసారు. అల్లరి నరేష్ తో తీయబోయే చిత్రాన్ని సాయి కిషోర్ పూర్తి వినోదాత్మకంగా రూపొందించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయింది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుంది. కామెడీ, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో లేడీ డాన్ గా కనిపించబోతోందట. అనిల్ సుంకర ఈచిత్రానికి నిర్మాత.
అల్లరి నరేష్ ప్రస్తుతం పలు చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. కెవ్వుకేక చిత్రంతో పాటు, యాక్షన్ 3డి చిత్రాలు చేస్తున్నారు. మే నెల వరకు ఈరెండు చిత్రాలకు సంబంధించిన పనులు పూర్తి కానున్నాయి. ఆ తర్వాత అల్లరి నరేష్-వరలక్ష్మి కాంబినేషన్లో సాయి కిషోర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











