నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ శబరి. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మహా మూవీస్ బ్యానర్‌పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాకు మహర్షి కూండ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ..
నా జీవితంలో పెళ్లి అనేది చాలా సర్‌ప్రైజ్. నేను పెళ్లి చేసుకొంటానని కూడా అనుకోలేదు. అలా నా జీవితంలో జరిగిపోయింది. అంతకంటే నా లైఫ్‌లో ఆశ్చర్యకరమైన విషయం మరోటి ఉండదు అని వరలక్ష్మీ శరత్ కుమార్ అన్నారు.

పెళ్లి చేసుకొన్నప్పటికీ.. నేను నా కెరీర్ ముఖ్యంగా భావిస్తాను. పెళ్లి తర్వాత నేను సినీ పరిశ్రమలోనే కొనసాగుతాను. పరిశ్రమకు దూరంగా ఉండను. నా పెళ్లి ఎంగేజ్‌మెంట్ జరిగిన మరుసటి రోజే నేను షూటింగ్‌కు వచ్చాను. నా కెరీర్, సినిమాపట్ల కమిట్‌మెంట్ అదే అని అన్నారు.
నా ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. పెళ్లి డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాను. అప్పటి వరకు ఎలాంటి సమాచారం నా వద్దలేదు. కానీ నా పెళ్లి మాత్రం ఈ సంవత్సరంలోనే అవుతుంది. ఈ ఏడాదిలోనే వివాహం జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి అని ఆమె చెప్పారు.

శబరిలో ప్రేమను పంచే తల్లి కథ. తన బిడ్డను కాపాడు కోసం తల్లి ఏం చేసిందనేది కథ. సినిమా బాగుంటే ఆదరించడం తెలుగు నైజం. హనుమాన్ మూవీని అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే. భావోద్వేగాలు పుష్కలంగా ఉన్న శబరి చిత్రాన్ని కచ్చితంగా ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది.
స్ట్రెయిట్ ఫార్వార్డ్ థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్ ఇచ్చే మూవీగా రూపొందిన ఈ చిత్రం మే 3వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఐదు భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











