Varalaxmi Sarathkumar: ఆ నటుడిని పార్టనర్ అన్న జయమ్మ.. హాట్​ టాపిక్​గా ట్వీట్​

వరలక్ష్మీ శరత్​ కుమార్​.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. సీనియర్​ హీరో, నటుడు శరత్ కుమార్​ గారాల కూతురిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. సినీ కెరీర్​ ప్రారంభంలో హీరోయిన్​గా అంతగా హిట్​ కానీ ఈ బొద్దుగుమ్మ నటిగా మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పటికే తెలుగులో రవితేజ నటించి హిట్ కొట్టిన క్రాక్​ సినిమాలో జయమ్మగా ఎంత పాపులర్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే జయమ్మ సోషల్​ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్​గా ఉంటుంది. తాజాగా ఓ నటుడిని పార్టనర్​ అని సంబోధిస్తూ చేసిన ట్వీట్​ ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

 కెరీర్​ ఆరంభంలో..

కెరీర్​ ఆరంభంలో..

సీనియర్​ నటుడు శరత్​ కుమార్ కూతురిగా సినీ రంగంలో కాలు మోపిన వరలక్ష్మీ శరత్ కుమార్​ హీరోయిన్​గా అనుకున్నంత సక్సెస్​ కాలేకపోయింది. కేరీర్ ఆరంభంలో విశాల్, శింబు వంటి తదితర మీడియం రేంజ్ హీరోలతో కొన్ని సినిమాలు చేసింది వరలక్ష్మీ శరత్​ కుమార్​.

నటనకు ప్రశంసలు..

నటనకు ప్రశంసలు..

కానీ ఆ సినిమాలు అనుకున్నంత పెద్దగా సక్సెస్ కాలేదు. హీరోయిన్​గా విజయం సాధించకపోయినప్పటికీ కూడా వరలక్ష్మి మంచి నటనతో ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చింది. అనంతరం లేడీ విలన్​గా కొన్ని సినిమాల్లో ఊహించినంత రేంజ్​లో రెస్పాన్స్ అందుకుంది.

విలన్​ పాత్రకు మంచి రెస్పాన్స్​..

విలన్​ పాత్రకు మంచి రెస్పాన్స్​..

ముఖ్యంగా విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో వరలక్ష్మీ శరత్​ కుమార్​ విలన్​గా కనిపించిన విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. దాదాపు హీరోతో సమానంగా చాలా అద్భుతంగా ఆ పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా తర్వాత ఆమె తెలుగు, తమిళంలో చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.

ఫుల్​ బిజీగా జయమ్మ..

ఫుల్​ బిజీగా జయమ్మ..

తెలుగులో క్రాక్​, నాంది, పక్కా కమర్షియల్​ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక స్టార్​ హీరోయిన్​ సమంత ప్రతిష్టాత్మక చిత్రం యశోదలో ఓ కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు శబరి, వర ఐపీఎస్, హనుమాన్ వంటి తదితర చిత్రాలతో బిజీగా ఉండనుంది.

నెటిజన్ల ట్రోలింగ్​..

నెటిజన్ల ట్రోలింగ్​..

కంటెంట్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకునే వరలక్ష్మీ ముక్కుసూటి మనిషి. ఎదైనా కుండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు తన మాటలతో విమర్శలు తెచ్చుకుంటుంది. ఇటీవల రాధికను ఆంటీ అని పిలిచి నెటిజన్ల ట్రోలింగ్​కు గురైంది.

పార్టనర్​ అంటూ..

పార్టనర్​ అంటూ..

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఆసక్తిరంగా ట్వీట్​ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక నటుడిని పార్టనర్​ అంటూ సంబోధిస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైనట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్​లో కోలీవుడ్ యాక్టర్ ప్రసన్నను పార్టనర్​ అంటూ ట్వీట్ చేసింది.

నాగార్జున భాయ్​ చిత్రంలో..

నాగార్జున భాయ్​ చిత్రంలో..

ఈ ట్వీట్​లో ''హ్యాపీ బర్త్​డే పార్టనర్​ ప్రసన్న.. హ్యావ్​ ఏ బ్లాస్ట్​.. కీప్ రాకింగ్''​ అని రాసుకొచ్చింది వరలక్ష్మీ శరత్​ కుమార్. అంతేకాకుండా ఈ ట్వీట్​కు ప్రసన్నతో దిగిన ఫొటోను కూడా యాడ్​ చేసింది. కాగా నటుడు ప్రసన్న వెంకటేషన్​ తమిళ నటుడు అయినప్పటికీ పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించాడు. మొదటగా నాగార్జునతో భాయ్​ చిత్రంలో నటించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X