twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కూతురికి లైంగిక వేధింపులు: ఒళ్లు అమ్ముకోవడాకి రాలేదు, ఉరి తీయాలని వ్యాఖ్య!

    తనకు ఎదురైన లైంగిక వేధింపుల అంశాన్ని కూడా వరలక్ష్మి ప్రస్తావించారు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రెండు రోజుల క్రితం మళయల నటిపై జరిగిన దారుణ సంఘటన నేపథ్యంలో.... తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి తనకు జరిగిన లైంగిక వేధింపుల అంశాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది.

    ప్రముఖ మళయాల హీరోయిన్ కిడ్నాప్, లైంగిక వేధింపులకు గురైన ఘటన సౌత్ సినీ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతోంది. తెలుగులో మహాత్మ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆమెకు ఇండస్ట్రీ వారి నుండి పూర్తి మద్దతు లభిస్తోంది.

    ఈ ఘటనపై హీరోయిన్ వరలక్ష్మి ఘాటుగా స్పందించారు. ఉమెన్ సేఫ్టీ అనేది జోక్ గా మారిందని, ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని ఆమె ఘాటుగా ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

    దీంతో పాటు తనకు ఎదురైన లైంగిక వేధింపుల అంశాన్ని కూడా వరలక్ష్మి ఈ సందర్శంగా ప్రస్తావించారు....

    టీవీ ఛానల్‌ ఫ్రోగ్రాం హెడ్ వేధింపులు

    టీవీ ఛానల్‌ ఫ్రోగ్రాం హెడ్ వేధింపులు

    ఇటీవల తాను ఓ టీవీ ఛానల్ కు వెళ్లినపుడు అక్కడి ఫ్రోగ్రాం హెడ్ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసాడని, తనపై దారుణంగా వ్యవహరించాడని, దీంతో తాను అక్కడి నుండి వెంటనే బయటకు వచ్చేసానని వరలక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    రెండు రోజులుగా సతమతం అవుతున్నా

    రెండు రోజులుగా సతమతం అవుతున్నా

    తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయట పెట్టాలా? వద్దా? అనే విషయంలో రెండు రోజులుగా సతమతం అవుతున్నాను, ఇలాంటి విషయాలు దాచడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకే ధైర్యం చేసి ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ వరలక్ష్మి ట్విట్టర్లో తెలిపారు.

    నీచంగా వ్యవహరించాడు

    నీచంగా వ్యవహరించాడు

    ప్రముఖ టీవీ చానల్ లో ఫ్రోగ్రామింగ్ హెడ్ తో సమావేశంలో పాల్గొన్నాను. మరో అరగంట తర్వాత మీటింగ్ ముగుస్తుందనే సమయానికి అతడు నాతో మనం బయట కలుద్దామని అన్నాడు, ఎందుకు అని అడిగితే వేరే విషయాల గురించి అన్నాడు... అప్పుడు అతడి మనసులో ఉన్న దురుద్దేశం అర్థమై అక్కడి నుండి కోపంగా బయటకు వెళ్లినట్లు వరలక్ష్మి తెలిపారు.

    శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదు

    శరీరాన్ని అమ్ముకోవడానికి రాలేదు

    సినీరంగంలోకి తాను శరీరాన్ని అమ్ముకోవడానికి కాలేదు, నాకు నటన అంటే ఇష్టం... ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించలేదు. సినీ పరిశ్రమతో పాటు బయట కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి, ఇలాంటి వాటిని దాచకూడదనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు.

    పురుషులకు ఘాటుగా

    పురుషులకు ఘాటుగా

    ఈ సందర్భంగా పురుషులను ఉద్దేశించి....మీరు మహిళలను అగౌరవంగా చూడటం మానుకోవాలని వరలక్ష్మి ఘాటు స్పందించారు.

    నా శరీరం నా ఇష్టం

    నా శరీరం నా ఇష్టం

    నేను నటిని, నటనలో భాగంగానే వెండి తెరపై గ్లామరస్ గా కనిపిస్తాం. అంత మాత్రాన తన గురించి ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోం. నా జీవితం, నా శరీరం నా ఇష్టం. ఎవరైనా తప్పుగా, అగౌరవంగా మాట్లాడితే సహించబోనని వరలక్ష్మి అన్నారు.

    అవకాశం లభించింది

    అవకాశం లభించింది

    అదృష్టవశాత్తూ తాను ఆ సంఘటన నుండి సురక్షితంగా బయట పడ్డాను. దీని వల్ల నాకు చాలా ముఖ్యమైన అంశంపై మాట్లాడే అవకాశం దక్కింది. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు..అన్ని చోట్ల, అన్ని వయసుల మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని ఆమె తెలిపారు.

     పురుషాధిక్యం వల్లే

    పురుషాధిక్యం వల్లే

    మనది పురుషాధిక్య సమాజం కావడం వల్లే మహిళలను వస్తువులుగా చూస్తూ అసమానతలు పెంచుకుంటున్నారు, మహిళలకు భద్రత అనేది ఒక కలగానే మిగిలిపోయింది. మనం సమాజం నుండి రేప్ అనే పదం ఎప్పటికీ తొలగిపోదా? అని ఆమె ఆవేశంగా ప్రశ్నించారు.

    దైర్యంగా ముందుకు రావాలి

    దైర్యంగా ముందుకు రావాలి

    మహిళలకు తమకు ఇలాంటి సంఘటనలు ఎదురైనపుడు ధైర్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఒంటరి కారు, నేను మీకు అండగా ఉంటాను అని ఈ సందర్భంగా వరలక్ష్మి వ్యాఖ్యానించారు.

    English summary
    The recent sexual assault on a well-known south Indian actor has incensed the members of the film industry and public across the country. Tamil actor Varalaxmi Sarathkumar has opened up about the issue of sexual harassment, which is constantly faced by the women in showbiz, while sharing a personal uncomfortable experience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X