రవితేజ కోసం లేడీ విలన్ వచ్చేసింది.. అధికారికంగా ప్రకటించిన డైరెక్టర్
స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ తమన్ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేనితో మళ్లీ జత కట్టబోతున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'డాన్ శీను', 'బలుపు' అనే హిట్ సినిమాలు వచ్చాయి. ఇక, ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసిన ఈ జంట.. ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథతో వస్తున్నారు. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వెలువడింది.
తాజాగా ఇందులో నటించబోయే మరో టాలెంటెడ్ నటి గురించి దర్శకుడు గోపీచంద్ ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశాడు. ఆమె మరెవరో కాదు.. తమిళ పరిశ్రమకు చెందిన వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమెను ఇందులో విలన్‌గా చూపించబోతున్నారని తెలుస్తోంది. వరలక్ష్మీ గతంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఆమె పలు చిత్రాల్లో విలన్‌గానూ కనిపించి మెప్పించింది. ఈ కారణంగానే చిత్ర యూనిట్ ఈమెను ఎంపిక చేసిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











