‘ముకుంద’:వరుణ్ తేజ్ కేక పెట్టించాడు(వీడియో)
హైదరాబాద్: మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ పరిచయ చిత్రం ‘ముకుంద'. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ హీరో తొలి చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత ప్రధానాంశాలుగా పట్టణ నేపథ్యంలో జనరంజకంగా ఈ చిత్రాన్ని మలిచారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ చిత్రంలో పాట టీజర్ ఒకటి రిలీజ్ చేసారు. ఈ టీజర్ ...చిత్రంపై హైప్ ఇంకా పెంచుతోంది. మీరూ ఓ లుక్కేయండి
పల్లెటూరి కుర్రాడిగా వరుణ్‌తేజ్ ఇందులో నటించారు. ‘ఠాగూర్' మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు. వచ్చే నెల 3న పాటలను, 24న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘వరుణ్‌తేజ్ అద్భుతంగా నటిస్తున్నాడు. కుటుంబసమేతంగా చూడతగ్గ కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మిక్కీ స్వరపరిచిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడలేదు' అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ ‘మా సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించింది. వరుణ్ చాలా బాగున్నాడనీ, మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటాడనీ అందరూ అంటున్నారు. డాన్సులు, ఫైట్లు బాగా చేశాడు. ఈ చిత్రం ఖచ్చితంగా అతనికి మంచి లాంచింగ్ అవుతుందని మా నమ్మకం' అని చెప్పారు. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











