'నేనింతే' సినిమాలో ఓ డైలాగ్ బ్రహ్మానందం చేసిన ఇడ్లీ విశ్వనాధం అనే పాత్ర చేత చెప్పిస్తాడు...అది కుక్కని పెట్టి అయినా సినిమా తీసి హిట్టిస్తాను అన్నట్లు. అదే నిజమవుతోంది ఇప్పుడు రవిబాబు డైరక్ట్ చేసిన నచ్చావులే చిత్రం పబ్లిసిటీ లో కుక్కులు,పిల్లులు,కుందేళ్ళు వంటి జంతువులు తప్ప వేరేవి చోటు చేసుకోవటం లేదు.అయినా ఓపినింగ్స్ చాలా బాగున్నాయి. అందులోనూ ఉషాకిరణ్ మూవీస్ కి గత కొంత కాలంగా హిట్టు కూడా కరువు అయ్యింది. అలాంటి పరిస్ధితుల్లో కూడా క్యూరియాసిటి క్రియేట్ చేసి స్టార్ హీరోల రేంజి కలెక్షన్స్ సంపాదించటం గ్రేట్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట. అందుకే పూరీ నేనింతే లో కామిడికీ ఆ డైలాగ్ చెప్పించినా అదే జరుగుతోంది అంటున్నారు.