twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varasudu First Review: మాస్ తోపాటు ఫ్యామిలీకి నచ్చేలా 'వారసుడు'.. ఓవర్సీస్ రేటింగ్ ఎంతంటే?

    |

    తెలుగు సినిమాలకు సంక్రాంతి పండుగ సీజన్ ఎంతో ప్రతిష్టాత్మకమైంది. అందుకే బడా హీరోలు, నిర్మాతలు ఈ పండుగపైనే ఫోకస్ పెడుతూ తమ చిత్రాలను విడుదల చేయాలనుకుంటారు. ఈసారి ఈ సంక్రాంతి బరిలో నలుగురు స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. వారిలో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకరు. మొదటిసారిగా విజయ్ చేస్తున్న బైలింగువల్ చిత్రం వారసుడు (తమిళంలో వారిసు). ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ రానే వచ్చింది. మరి వారసుడు ఫస్ట్ రివ్యూ ఎలా ఉందే చూసేద్దామా!

    అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా..

    అత్యధిక మార్కెట్ ఉన్న హీరోగా..

    తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపును అందుకున్న విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అలాగే సౌత్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ స్థాయిలో పారితోషికం అందుకున్న హీరోలలో అతను కూడా ఒకడు. ఒక విధంగా సౌత్ లో ఇప్పుడు అత్యధిక మార్కెట్ ఉన్న హీరో కూడా అతనే అని చెప్పవచ్చు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే విజయ్ తాజాగా మొదటిసారి తెలుగు స్ట్రయిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.

    నిర్మాతలుగా దిల్ రాజు, శిరీష్..

    నిర్మాతలుగా దిల్ రాజు, శిరీష్..

    కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'వారసుడు' (తమిళంలో వారిసు). ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, ప్రభు, ప్రకాశ్ రాజ్, ఖుష్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

    భారీగా స్పందన..

    భారీగా స్పందన..

    కార్పోరేట్ దిగ్గజం అయిన బిజినెస్‌మ్యాన్ అనుకోని పరిస్థితుల వల్ల కష్టాల్లో పడడంతో ఆయన చిన్న కొడుకు వచ్చి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనే కథాంశంతో ఈ 'వారసుడు' సినిమా తెరకెక్కినట్లు మూవీ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని ప్రచార చిత్రాలకు భారీ స్పందన దక్కింది. అలాగే, పాటలూ అదరగొట్టేశాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోనే ఏర్పడ్డాయి.

    ఎట్టకేలకు జనవరి 14న..

    విజయ్-రష్మిక నటించిన 'వారసుడు' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత పలు చిత్రాలు కూడా పండగ రేసులో నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఇష్యూ కారణంగా వివాదం చెలరేగింది. అలాగే, తమిళంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై కొంత సందిగ్ధత నెలకొనగా ఎట్టకేలకు జనవరి 14న విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి దిల్ రాజు ప్రకటించారు.

    సోషల్ మీడియాలో ఫస్ట్ రివ్యూ...

    ఇటీవలే వారసుడు చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకోగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ ను జారీ చేసింది సెన్సార్ బోర్డ్. అయితే ఈ సినిమా విడుదలకు నాలుగు రోజులు ఉందనగా అప్పుడే వారసుడు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ సెన్సార్​ సభ్యుడు, సినీ విశ్లేషకుడు అయిన ఉమర్​ సంధు.. విజయ్ వారసుడు చిత్రాన్ని వీక్షించిన అనంతరం సోషల్ మీడియా వేదికగా తన రివ్యూ ఇచ్చాడు.

    ఎంగేజింగ్ గా ఫ్యామిలీ డ్రామా..

    "విజయ్ మరోసారి మ్యానరిజం, డైలాగ్ లతో మరోసారి తన నటన ఏంటో నిరూపించాడు. ఫ్యామిలీ డ్రామాలో అద్భుతంగా ఎమోషన్స్ పండించాడు. అతని నుంచి అలాంటి నటన చూడటం గొప్పగా ఉంది. సింపుల్ కథ. మనసుకు హత్తుకునే ఎమోషన్స్. ఈ సంక్రాంతికి ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండే చక్కటి ఫ్యామిలీ డ్రామా. విజయ్ తో పాటు మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తమ అద్భుతమైన నటనతో మంత్రముగ్ధులను చేస్తారు" అని రాసుకొచ్చిన ఉమర్ సంధు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఇది ఓవర్సీస్ సెన్సార్ నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ అని తెలిపాడు.

    మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ కి..

    అలాగే ఇంకొక ట్వీట్ లో "విజయ్-రష్మికల కెమిస్ట్రీ బాగుంది. రష్మిక చాలా హాట్ గా కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో, పోస్ట్ ఇంటర్వెల్ సన్నివేశాల్లో ఒక 15 నిమిషాల నిడివి తగ్గించాల్సింది. క్లైమాక్స్ మాత్రం అమేజింగ్. సినిమాలో విజయ్ ఎంట్రీకి క్లాప్స్ పడతాయి. మాస్ ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉంటాయి. మీరు సరిగ్గా గ్రహిస్తే అవన్ని బాగా అర్థమై నచ్చుతాయి. తండ్రీ కొడుకుల, తల్లీ కొడుకుల అనుబంధం చక్కగా ఉంది. సినిమాటోగ్రఫీ విజవల్ ఫీస్ట్. అదిరిపోయే డైలాగ్ లు, రాకింగ్ మ్యూజిక్ తో పాటు సపోర్టింగ్ క్యారెక్టర్స్ డీసెంట్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది" అని రాసుకొచ్చిన ఉమర్ సంధు 5కి 3.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

    English summary
    Vijay Vamshi Paidipally Combo Movie Varasudu First Review By Film Critic And Censor Board Member Umair Sandhu And Gives Above 3 Rating
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X