'వర్మ గారు పోతున్నారు పిచ్చాసుపత్రికి' టైటిల్ తో చిత్రం
రామ్ గోపాల్ వర్మ సినిమా రెడ్డిగారు పోయాక కు కౌంటర్ గా వర్మగారు పోతున్నారు పిచ్చాసుపత్రికి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని మీడియాకు ...ఓసి వెలఫేర్ అశోషియేషన్ ప్రెసిడెంట్ జి.కరుకార్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ...త్వరలోనే ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయిస్తున్నాం. రామ్ గోపాల్ వర్మ ఓ పర్టిక్యులర్ గా ఓ కమ్యూనిటిని టార్గెట్ చేయటంతో మేము ఇలా చేస్తున్నాం అన్నారు. రెడ్డి కులాన్ని ఆయన ఇన్సల్ట్ చేస్తున్నారు అన్నారు. గతంలో కూడా కరునాకర్ రెడ్డి రక్త చరిత్ర సమయంలో వర్మకు వ్యతిరేకంగా కేసు వేసారు. కులం పేరు పెట్టి సినిమాల్లో అపహాస్యం చేసే వారిపై 153-A కేసు వేస్తామని హెచ్చరించారు.
అలాగే వర్మ తన రెడ్డిగారు పోయారు సినిమా ప్రారంభించగానే తాను సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. ఇక కొద్ది రోజులు క్రితం రామ్ గోపాల్ వర్మ 'రెడ్డి గారు పోయారు' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయ కోణాన్ని టచ్ చేస్తూ ఈ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు ఈ దర్శకుడు. ఈ చిత్రం టైటిల్ ను 'రెడ్డి గారు పోయారు'అని కాకుండా 'ఆయన పోయారు'గా మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ..టైటిల్ మార్చాలని వచ్చిన హెచ్చరికలపై వర్మ ట్విట్టర్లో తనదైన రీతిలో స్పందించారు. 'రెడ్డి గారు పోయారు టైటిల్ మీద ఎందుకు ప్రాబ్లమో? అర్థం కావడం లేదు. వాళ్ల ప్రాబ్లం రెడ్డి గారు పోలేదనా? లేక రెడ్లెవరూ పోరనా?'' అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











