'గాయం' సీక్వెల్ స్టోరీ లైన్...
తాను త్వరలోనే గాయం సీక్వెల్ నటించే అవకాశంఉందని జగపతిబాబు అన్నారు. తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన గాయం రిలీజై పదిహేను అయిన సందర్భాగా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ సంవత్సరం చివరకు ఈ గాయం సీక్వెల్ చిత్రం ప్రారంభిస్తామన్నారు. అలాగే దర్శకుడుగా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కళ్యాణ్ పరిచయం అవుతాడని అన్నారు. ఇక ఈ సీక్వెల్ చిత్ర కథాశం అప్పటి గాయంలో ఉన్న దుర్గ, అతని గ్యాంగ్ పదిహేను సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారనేదే అని చెప్పుకొచ్చారు.
అంతేగాక రామ్ గోపాల్ వర్మ తనకు శివ చిత్రం ముందు నుంచి పరిచయమంటున్నాడు జగపతిబాబు. తనని చిత్ర పరిశ్రమలోకి వెళ్ళమని ఎంకరేజ్ చేసిన స్నేహితులలో మెదటివాడు వర్మ. అయితే ఆయనతో సినిమా చేయటం గాయం దాకా కుదరలేదు. నా సినిమాలు వరస ప్లాప్ అవుతూంటే నిరాశపడవద్దని ధైర్యం చెప్పిన వ్యక్తి అతను అంటూ వర్మ గురించి చెప్పుకొచ్చాడు. అలాగే పెద్దరికం సమయంలో ప్రివ్యూ చూసి అందులో యాక్షన్ సీక్వెన్స్ చూసి తనతో సినిమా చేయటానికి ముందుకొచ్చారంటూ వివరించాడు. ఇక గాయం అనంతరం వరసగా యాక్షన్ సినిమాలు చేయకపోవటానికి కారణం మావిచిగురు, శుభలగ్నం హిట్టటి ఫ్యామిలీ హీరో అని మద్ర వేయటమేనని అన్నారు.


Click it and Unblock the Notifications











