డైరక్టర్ ని ప్రక్కన పెట్టి వర్మ లాగిస్తున్నాడు
రామ్ గోపాల్ వర్మకి మొదటి నుంచి తను చేసే ప్రాజెక్టులకు అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర ఉండేలా చూసుకోవటం అలవాటు.అలాగే ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వివేక్ కృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ రూపొందుతున్న బెజవాడ రౌడీలు కు కూడా అదే పని చేస్తున్నాడని తెలుస్తోంది.డైరక్టర్ ని ప్రక్కన పెట్టి కీలకమైన సన్నివేసాలన్నీ ఘోస్ట్ డైరక్టర్ గా లాగించేస్తున్నాడని తెలుస్తోంది.ఇక ఈ చిత్రానికి వర్మ కేవలం నిర్మాతే.విజయవాడలో ఉన్న ఆయన కొన్ని సీన్స్ షూట్ చేసారు.ఇక స్క్రిప్టుని కూడా వర్మ పూర్తిగా తనకు తగినట్లుగా రాయించుకుని, అన్ని సూచనలూ ఇచ్చే దర్శకుడుని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.ఇక ఇలా వర్మ కలగచేసుకుని చేస్తే ఆ దర్శకుడుకి నెక్ట్స్ సినిమా కి ఇబ్బంది ఎదురౌతుందని కొందరంటున్నారు.


Click it and Unblock the Notifications











