నిర్మాతగా పరిచయం కానున్న వర్మ కూతురు రేవతి
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూతురు రేవతి త్వరలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణ కూతురు మంజుల, మోహన్ బాబు కూతురు లక్ష్మీప్రసన్నలు పరిశ్రమలోకి అడుగుపెట్టి నిర్మాతలుగా, నటీమణులుగా నిరూపించుకున్నారు. ఇక కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ సైతం హీరోయిన్ గా వచ్చింది. ఇలా పరిశ్రమలో ఉన్న వాళ్ల కూతుర్లు ఇదే రంగంలోకి రావటం చాలా తక్కువే అనుకోవచ్చు. మంజుల, లక్ష్మీప్రసన్నల దారిలో వర్మ కూతురు రేవతి కూడా నడవాలనుకుంటుంది. వర్మ ఆమెను నిర్మాతగా పరియటం చేయనున్నట్లు తెలుస్తోంది.
రేవతి రష్యాలో మెడిసిన్ కోర్సు చదువుతున్నది. తన తండ్రి రక్తచరిత్ర చిత్రం తీశాక దాని గురించి అక్కడ వచ్చిన టాక్‌ను బట్టి ఆమె ఫోన్లలో చర్చించడం వర్మకు ఆసక్తి పేకెత్తించింది. రంగం గురించే ఎక్కువగా మాట్లాడటంతో ఈ రంగంలో ఇంట్రెస్ట్ ఉంటే తాను ప్రోత్సహిస్తానని వర్మ చెప్పారు.


Click it and Unblock the Notifications











