రామ్ గోపాల్ వర్మ, జెడీ చక్రవర్తి పోటాపోటీగా...
రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసి జెడి చక్రవర్తి ఇప్పుడు ఆయనకే పోటీగా మారుతున్నాడు. ఇద్దరూ ఒకే రోజు తాము డైరక్ట్ చేయబోయే చిత్రాలును ప్రారంభిస్తున్నారు. దాదాపు 12 సంవత్సరాల గ్యాప్ తర్వాత రామ్ గోపాల్ వర్మ తెలుగులో దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కధ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: అప్పలరాజు' ఈసినిమా ఈనెల 27న ప్రారంభం కానుంది. అలాగే జేడి చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న మనీ సేక్వేల్ 'మనీ మనీ మోర్ మనీ' సినిమా కుడా అదే రోజున షూటింగ్ ప్రారంభంకానుంది. ఇక 'కధ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: అప్పలరాజు' చిత్రం సునీల్ హీరోగా చేస్తూండగా.. జెడీతో హోమం, సిద్దం తీసిన కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక 'మనీ మనీ మోర్ మనీ' విషయానికి వస్తే...మనీ పార్ట్-1, మనీ పార్ట్-2 లో వున్న జెడి, బ్రహ్మానందం పాత్రలు ఈ సీక్వెల్ లో కూడా యధావిధిగా కొనసాగుతాయి. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తాడు.రెండూ కామిడీగా నడిచే చిత్రాలే కావటం మరో విశేషం. ఈ రెండు చిత్రాల్లో ఏది నిలబడుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











