భానుతో వర్మకు లింకే హాట్ టాపిక్
మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్ తో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబందాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో అరెస్టయి బెయిల్ పై విడుదలైన మరో సినీ నిర్మాత సి.కళ్యాణ్ సిఐడికి చెప్పారు. ఈ మ్యాటరే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టారిక్ గా మారింది. నిజంగానే వర్మ, భాను కిరణ్ కలిసి పనిచేసారా అనేది పరిశ్రమలో ఇద్దరు కలిసినప్పుడల్లా హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.
అలాగే రక్త చరిత్ర సినిమాకోసం రామ్ గోపాల్ వర్మ తో భాను కిరణ్ కలిసి ఔట్ డోర్ లోకేషన్స్ ఎంపిక చేసే విషయంలో సమన్వయం చేసేవాడని సి.కళ్యాణ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రెండువేల ఎనిమిది-తొమ్మిది లో ఈ సినిమాను హిందిలో తీశాక తనబాలాజి కలర్ లాబ్ లో ప్రాసెస్ చేశారని తెలిపారు. ఆ సినిమా రైట్స్ కొనుగోలు చేసి తెలుగులో తీశానని, ఆ సమయంలో భానుకిరణ్ తో తనకు సంబంధాలు ఏర్పడ్డాయని కళ్యాణ్ చెప్పారు. అప్పటికే భానుకి రామ్ గోపాల్ వర్మకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
రెండువేల తొమ్మిదిలోనే తనను సూరివద్దకు భాను తీసుకు వెళ్లాడని, రక్త చరిత్రకు సంబందించి కళ్యాణ్ అడిగాడని తెలిపారు. ఈ సినిమాలో తనను విలన్ గా చూపారా అని ప్రశ్నించారని అన్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు తాను చెప్పలేనని జవాబు ఇచ్చానన్నారు. తదుపరి మద్దెలచెరువు సూరి నిమ్స్ లో ఉన్నప్పుడు కలిశానని, అప్పుడు మరో నిర్మాత శింగనమల రమేష్ తో కలిసి వెళ్లానని కూడా ఆయన వెల్లడించారు. దాంతో ఈ మ్యాటర్ పై వర్మ స్పందన ఏమీ లేకపోయినా భవిష్యత్ లో వర్మకు కూడా బిగుసుకునే అవకాశముందంటున్నారు.


Click it and Unblock the Notifications











