దీన్ని మించిన కథ నేను చేయలేదు...వర్మ
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం రక్త చరిత్ర ఆడియోను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిన్న(ఆదివారం) విడుదల చేసారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ...నా కెరీర్‌లో ఇది చాలా ముఖ్యమైన సినిమా. ఎవరూ ఊహించలేని కథ, కథనాలతో ఈ సినిమా ఉంటుంది. హ్యూమన్ ఎమోషన్సే ఈ చిత్ర కథకు ప్రాణం. దీన్ని మించిన బెటర్ కథ నేను ఇప్పటి వరకూ చేయలేదు. కొందరు జీవితాల సమాహారమైన ఈ కథను నాకు చేతనైన విధంగా తీశాను. జరిగిన పరిణామాలన్నింటిని ప్రత్యక్షంగా చూసిన సాక్షుల వివరణను బట్టి తీసిన సినిమా ఇది. వాళ్లు కూడా అన్నీ నిజాలే చెప్పారంటే నేను నమ్మను. అందుకే ఈ సినిమా విషయంలో నేను చెప్పేది ఒక్కటే.. ఇది యధార్థాలతో కూడిన కల్పిత కథ అని చెప్పారు.
అనంతరం నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ...దాదాపు 20 ఏళ్ల క్రితం వర్మ హీరోచేత సైకిల్ చైన్ పట్టిస్తే. అప్పట్లో తెలుగు నేల ఉలిక్కిపడింది. ఇప్పుడాయన హీరోతో కత్తి పట్టించారు. కుళాయి నీటితో కత్తిని కడుగుతున్న ఆ పోస్టర్‌ని చూస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఇక సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహకే అందడంలేదు అని చెప్పారు. ఇక ఈ చిత్రం ఆడియోను మధుర ఆడియో వారు విడుదల చేసారు. ఈ పంక్షన్ లో నిర్మాతలు మధు మంతెన, శీతల్ వినోద్ తల్వార్, చిన్న వాసుదేవరెడ్డి, రాజ్‌కుమార్, మధుర శ్రీధర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











