మరో పాట వివాదంతో రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో వివాదానికి తెరలేపారు. తన తాజా చిత్రం రణ్ కోసం ముందుగా అనుకున్న 'జనగణమణ' పాట ను తీసేసి వందేమాతరం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. జాతీయగీతాన్ని తీసేసి జాతీయ గేయాన్ని పెట్టుకోవడం ద్వారా మరో వివాదానికి కారణమయ్యాడు. దాంతో వర్మని ఒక వివాదం నుంచి మరో వివాదానికి ఎందుకు వెళ్తున్నారు? అని అడిగితే "నేనేమీ కావాలని వివాదాన్ని సృష్టించడం లేదు. కేవలం వందేమాతరంలోని రెండు పదాల్ని మాత్రమే తీసుకున్నాను. ఇందులో మేం చేసిన తప్పేమీ లేదు. మొత్తం గీతం... దానికున్న నేపథ్యం వినండి" అంటున్నారు. రణ్' సినిమా కథాంశం కూడా కొత్త చర్చలకు తెర తీస్తుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రసార మాధ్యమాల మధ్య నెలకొన్న పోటీ, దాని పరిణామాల నేపథ్యంగా ఈ చిత్రం సాగుతుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్, పరేష్‌రావల్, మొహినీష్ బెహల్, సుచిత్రా కృష్ణమూర్తి, గుల్ పగన్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











