సంచలనం సృష్టిస్తున్న వర్మా నీకుంది ముందు ముందు కర్మ...
రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు"లో క్యారెక్టర్స్ అవుట్ లైన్ ఏమిటో ఇంతకుముందే బ్రోచర్ రిలీజ్ చేశారు. అప్పుడే ఆ బ్రోచర్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. తాజాగా క్యారెక్టర్లని విజువల్ గా పరిచయం చేస్తూ ట్రెయిలర్ రిలీజ్ చేశారు. జస్ట్ ఒక్కో డైలాగ్ తోనే ప్రతి క్యారెక్టరూ బ్రహ్మాండంగా పేలిందన్న సంగతి అర్థమైంది. అవతలి వాళ్ల సినిమాలు ఆడకుండా తొక్కేయడానికి హీరోలు చేసే కుట్రలు, రేటు చెబితే రేటింగ్ ఫిక్స్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసే ఫిలిం క్రిటిక్స్, నిర్మాతల భార్యలకి 'అన్నయ్య" పాత్ర పోషించే మధ్యవర్తులు, మీరోయిన్లకి కురచ బట్టలేసి వర్షంలో తడవమని కోరే నిర్మాతలు..ఇలా అందరిపై ఈ చిత్రంలో వర్మ సెటైర్లు సంధించాడు.
వచ్చేవారం విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే మోస్ట్ అవైటెడ్ మూవీ అనిపించుకుంటోంది. ఇప్పుడీ ట్రెయిలర్ తో మరింత హాట్ గా మారుతుందనిపిస్తోంది. ట్రెయిలర్ తోనే చాలా మందికి గుండెళ్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వర్మ ఇక మూవీ రిలీజ్ చేశాక ఎలాంటి పిడుగులు కురిపిస్తాడో అనేది ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











