అర్జున్ రెడ్డి తమిళ్ టైటిల్ రచ్చ రచ్చ.. సోషల్ మీడియాలో సునామీ
తమిళంలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు పెట్టిన టైటిల్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నది. ఇంతకు ఆ టైటిల్ ఏంటో తెలుసా?
టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అర్జున్‌రెడ్డి చిత్రం దిమ్మతిరిగేలా హిట్ కొట్టింది. ఆ చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరో అయిపోయాడు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అన్ని ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది పర్సన్ అయ్యాడు. అంతంటి ఘన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేయడానికి అన్ని పరిశ్రమల నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు తమిళంలో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ సినిమాకు పెట్టిన టైటిల్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నది. ఇంతకు ఆ టైటిల్ ఏంటో తెలుసా?

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ
సినిమాలో కూడా కంటెంట్ ఉండటంతో ‘అర్జున్‌రెడ్డి' టాక్ ఆఫ్ ది ఆల్ ఇండస్ట్రీ అయింది. తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్‌తో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే ధృవ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

అర్జున్ రెడ్డికి వర్మ అనే టైటిల్
అయితే తెలుగులో ‘అర్జున్‌రెడ్డి'గా వచ్చిన ఈ చిత్రానికి తమిళ్‌లో ఆసక్తికరమైన పేరు పెట్టి ఇప్పటి నుండే వార్తల్లో ఉండేలా చేశారు. ‘వర్మ' అనే టైటిల్‌ని ఈ చిత్రానికి కన్ఫర్మ్ చేశారు.

ఆర్జీవీ టైటిల్‌తో రచ్చ రచ్చ
సోషల్ మీడియాలో తన ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్ట్‌లతో రచ్చ రచ్చ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సంచలనం అవుతున్నారు. వర్మగా సుపరిచితుడైన ఆర్జీవీ పేరును తమిళ అర్జున్ రెడ్డి టైటిల్‌గా పెట్టడంతో ధృవ్ చలా ఈజీగా పాపులర్ అయిపోతాడంటూ సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిసున్నారు.

వర్మ టైటిల్‌కు గుడ్ ఫీడ్ బ్యాక్
ఈ టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత సెలబ్రిటీల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్. ‘అర్జున్‌రెడ్డి'కి తెలుగులో సందీప్ వంగా దర్శకత్వం వహించగా.. ‘వర్మ' పేరుతో వస్తున్న ఈ చిత్రానికి బాల దర్శకత్వం వహిస్తున్నారు.
జూనియర్ చియాన్ బయటకు..
బ్యాగులో నుంచి పిల్ల బయటకు వచ్చింది. జూనియర్ చియాన్ నటించే తొలి సినిమా టైటిల్ పేరు వర్మ. తెలుగులో ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రానికి ఇది రీమేక్ అంటూ సీనియర్ చియాన్ విక్రమ్ ట్వీట్ చేశారు.

సోషల్ మీడియాలో రచ్చ
అర్జున్ రెడ్డి తమిళ రీమేక్‌కు వర్మ అని టైటిల్ కన్ఫర్మ్ చేయగానే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ వేగంగా వైరల్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పోస్టర్ ఆకట్టుకొంటున్నది.

బాలా దర్శకత్వంలో
సేతు, శివపుత్రుడు లాంటి చిత్రాలతో విక్రమ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టిన బాలా ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఈ చిత్రం బాలా చేతిలో పడటంతో న్యాయం చేకూరుతుంది అనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











