వర్మగారు పోయారు... (వీడియో)
హైదరాబాద్: గతంలో రెడ్డిగారు పోయారు అంటూ ఓ చిత్రం టైటిల్ అందరిలో నలిగింది. అయితే వర్మగారు దాన్ని రకరకాల కారణాలతో డ్రాప్ అయ్యారు. నిజానికి నేమ్ డ్రాపింగ్ తో కలెక్షన్స్ వస్తాయా...ఏమో... ఎవరి ఆలోచనలు వారివి. ఎప్పుడూ పబ్లిసిటీ అంటూ ఎవరో ఒకరిని ట్వీట్ లో వెటకారం చేసే ఆయన పేరు వాడుతూ ఓ చిత్రం'వర్మగారు పోయారు...' అనే టైటిల్ తో వస్తోంది. అయితే రామ్ గోపాల్ వర్మకి దీనికి ఏం సభంధం లేదని అంటున్నారనుకోండి. ఆ చిత్రం టీజర్ విడుదల చేసారు చూడండి...
<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/JPsZK6-snlg" frameborder="0" allowfullscreen></iframe></center>
నవరసన్, అనూష, భవాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వర్మగారు పోయారు. కనకదుర్గ ఫిలింస్ పతాకంపై అజయ్ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ... పదేళ్లుగా చిత్రపరిశ్రమలో వున్నాను. కానీ సరైన గుర్తింపు దక్కలేదు. దర్శకుడిగా ఇది నా రెండవ చిత్రం. ఈ సినిమాతో బ్రేక్ లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇక చిత్ర కథ విషయానికొస్తే..వర్మ అనే ఓ వ్యాపారి సినిమాలమీద వున్న ఆసక్తితో ఓ చిత్రాన్ని నిర్మిస్తాడు. ఎంతో కష్టపడి తీసిన సినిమా విడుదలకు ముందే పైరసీ అవుతుంది.

ఆ బాధతో అతడు చనిపోతాడు. ఇదే మా చిత్రకథ. ఎవరినో ఉద్దేశించి తీసిన సినిమా కాదిది. పైరసీ వల్ల సినిమా పరిశ్రమ ఎంత నష్టపోతుందో ఈ సినిమాలో చూపించాం. రెండవ షెడ్యూల్ పూర్తయింది. త్వరలో చేయబోయే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. వచ్చే నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు.


Click it and Unblock the Notifications











