అనుష్క 'వర్ణ' ఆడియో తేదీ ఖరారు

దర్శకుడు మాట్లాడుతూ... ''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి''అని తెలిపాయి. గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తోంది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్ జైరాజ్.


Click it and Unblock the Notifications











