ఎంత కష్టం? కనీస వసతులు కూడా లేకుండా అనుష్క!

By Bojja Kumar

హైదరాబాద్: సాధారణ జనాలే కనీస వసతులు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేక పోతున్నారు. కానీ అనుష్క లాంటి స్టార్ హీరోయిన్లు కనీస వసతులు కూడా లేకుండా గడపాల్సి వస్తే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఈ విషయాన్ని 'వర్ణ' సినిమా యూనిట్ సభ్యులు వెల్లడించారు.

'వర్ణ' చిత్రంలో అనుష్క రెండు వైవిద్యమైన పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. పోరాట యోధురాలిగా, అమాయకమైన అమ్మాయిగా అనుష్క రెండు పాత్రల్లో నటించింది. ఆమె గురించి సినిమా బృందం సభ్యులు మాట్లాడుతూ...ఆ రెండు పాత్రల్లో అనుష్క శారీరకంగా ఎక్కువ కష్టపడింది 'పోరాట యోధురాలి' పాత్ర కోసమే. ఆ పాత్ర చిత్రీకరణ దాదాపుగా జార్జియాలో జరిగింది. 90 రోజుల పాటు ఏకధాటిగా జరిగిన సింగిల్ షెడ్యూల్‌లో ఆ పాత్ర చిత్రీకరణ పూర్తి చేయడం జరిగింది. చిత్రీకరణలో భాగంగా కొన్ని కీలక పోరాట సన్నివేశాల్లో అనుష్క పాల్గొన్నారు.

దేశం కాని దేశంలో కారణాంతరాల వలన ఒక స్టార్ హీరోయిన్‌గా అనుష్కకు అందించాల్సిన కనీస వసతులు కూడా చిత్ర బృందం అందించలేకపోయింది. జార్జియాలో మైనస్ డిగ్రీ టెంపరేచర్‌ను కూడా తట్టుకుని, నిద్రాహారాల గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా...తన పాత్రను రక్తి కట్టించడం కోసం అనుష్క పడిన కష్టం యూనిట్ సభ్యులను విస్మయానికి గురి చేసింది. స్వతహాగా ఎంతో హుందాగా వ్యవహరించే అనుష్క 'వర్ణ' షూటింగ్ సమయంలో కూడా తనదైన శైలిలో యూనిట్ సభ్యులతో కలిసిపోయి చిత్ర బృందానికి నూతనోత్సాహాన్ని ఇస్తుండేందని తెలిపారు.

అనుష్క, ఆర్య జంటగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో పివిపి సినిమా బేనర్‌పై నిర్మించిన 'వర్ణ' చిత్రం ఈ నెల 22న తెలుగు, తమిళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X