ప్రేమలో తెలుగు హీరో, హీరోయిన్: త్వరలోనే ఇద్దరికీ పెళ్లి.. ఇదిగో అసలైన క్లారిటీ

సాధారణంగా సినీ రంగంలోని నటీనటుల జీవితాలు తెరిచిన పుస్తకాల్లాగానే ఉంటాయి. దీనికి కారణం వాళ్ల వాళ్ల లైఫ్‌లలో జరిగే ఎలాంటి అంశం అయినా ఇట్టే బయటకు వస్తుండడమే. మరీ ముఖ్యంగా హీరో, హీరోయిన్ల ప్రేమ వ్యవహారాలు, డేటింగ్‌లు, పెళ్లి వార్తలు మరింత హైలైట్ అవుతూ ఉంటాయి.

ఇలా టాలీవుడ్‌లో ఎంతో మంది మధ్యన ఇలాంటి కథలో ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు యంగ్ హీరో హీరోయిన్లు పెళ్లికి రెడీ అయినట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా సదరు ముద్దుగుమ్మ క్లారిటీ ఇచ్చేసింది. ఆ వివరాలను మీరే చూడండి!

Varsha Bollamma Gives Clarity On Marriage With Bellamkonda Ganesh Babu

ప్రేమలో హీరో, హీరోయిన్: టాలీవుడ్‌లోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలతో విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ వర్ష బొల్లమ్మ. తెలుగులో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కుమారుడు, యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ బాబుతో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

Varsha Bollamma Gives Clarity On Marriage With Bellamkonda Ganesh Babu

ఆ సినిమా అప్పుడే స్టార్ట్: వర్ష బొల్లమ్మ.. బెల్లంకొండ గణేష్‌తో కలిసి 'స్వాతి ముత్యం' అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం రిలీజ్ సమయంలోనే ఈ న్యూస్ వైరల్ అయింది. అయినప్పటికీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఫలితంగా ఇది హాట్ టాపిక్ అయిపోయింది.

Varsha Bollamma Gives Clarity On Marriage With Bellamkonda Ganesh Babu

త్వరలోనే పెళ్లి అంటూ: టాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్ వర్ష బొల్లమ్మ - బెల్లంకొండ గణేష్ బాబు ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఇటీవలి కాలంలో విస్తృతం అయిపోయాయి. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుందని మరో ప్రచారం మొదలైంది. అంతేకాదు, త్వరలోనే నిర్మాత బెల్లంకొండ సురేష్ అధికారికంగా వీళ్లిద్దరి పెళ్లి గురించి ప్రకటన చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్: వర్ష బొల్లమ్మ ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాలో నటించింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ ఆమె ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నించారు. దీనికి వర్ష బొల్లమ్మ క్లారిటీ ఇస్తూ ఆ వార్తలను తీవ్రంగా ఖండించింది.

Varsha Bollamma Gives Clarity On Marriage With Bellamkonda Ganesh Babu

ఆమె ఏం చెప్పిందంటే: తాజా ఇంటర్వ్యూలో వర్ష బొల్లమ్మ 'ఓ ఇద్దరు యాక్టర్లు ఒక చోట కలుసుకున్నారని, కాఫీ తాగారని తెలిస్తే ఇలాంటి గాసిప్పులు పుట్టించడంలో ఓ అర్ధం ఉంది. ఆ సినిమా (స్వాతి ముత్యం) తర్వాత మళ్ళీ గణేష్‌ను నేను కలిసిందే లేదు. అయినా కూడా అలా ఎలా పుకార్లు పుట్టించేశారో అర్ధం కాలేదు. ఈ వార్తల్లో అసలు ఏమాత్రం నిజం లేదు' అంటూ పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X