twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఘనంగా ‘వరుడు’ పాటలు

    By Sindhu
    |

    అల్లు అర్జున్ హీరోగా హీరోయిన్ ఎవరో సస్సెన్స్ గా గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం 'వరుడు". యూనివర్శల్ మీడియా పతాకంపై డీవివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విశేషాలతో షూటింగ్ జుపుకున్న ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం మార్చి 7న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిత్రం యూనిట్ సభ్యులంతా పట్టు వస్త్రాలు దరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. సాధారణంగా గుణశేఖర్ అనగానే ఎంతో ఊహించుకునే ప్రేక్షకులు అందునా స్టైలిష్ హీరో అల్లు అర్జున్ హీరో కావడంతో అంచనాలు ఫుల్ గా నెలకొన్నాయి. అంతే కాదు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది..ఇప్పటి వరకు తెలుపక పోవడం విశేషం ఈ విశేషంపై దర్శకనిర్మాతలు కొంచెం గొడవ పడినట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ నిర్మాత సర్ధకున్నాడని సమాచారం.

    ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ, అల్లు అర్జున్ పాత్ర, అభినయం ఈ చిత్రానికి హైలెట్ గా ఉంటాయనీ, గుణశేఖర్ తన దర్శకత్వ ప్రతిభ మరొక్కసారి నిరూపించుకున్నారనీ మణిశర్మ కథకు తగినట్టుగా అందరినీ ఆకట్టుకునే పాటలు సమకూర్చాడని తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తొలి సీడీని ఆవిష్కరించగా, తొలి ఆడియో క్యాసెట్ ను శ్యామ్ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. దిల్ రాజు, అల్లు అర్జున్, బి.గోపాల్, అల్లు అరవింద్, సురేష్ బాబు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మట్లాడుతూ గుణశేఖర్ సినిమాలను ఎంతగానో ప్రేమిస్తాడు. అతని కథలు కథనాలు ఎంతో డిఫరెంటుగా ఉంటాయని, ఈ చిత్రం విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. వేటూరి సుందరామ్మూర్తి మాట్లాడుతూ మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారని ఈ చిత్రం శతదినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X