ఓవర్ సీస్ మార్కెట్ ను దెబ్బతీసిన అల్లు అర్జున్ వరుడు?
అల్లు అర్జున్, గుణశేర్ కాంబినేషన్లో వచ్చిన వరుడు చిత్రం ఇక్కడ ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యుఎస్ లోనూ సేమ్ సిట్యువేషన్ కొనసాగుతోంది. దాంతో వరుడు కొనుక్కున్న యు.ఎస్ బయ్యర్లు నిరాశలో మునిగిపోయారని తెలుస్తోంది. ట్రాన్స్ పొర్టేషన్ ఖర్చులు కూడా రావు అని బహిరంగంగానే కామెంట్స్ వినపడుతున్నట్లు చెప్తున్నారు. ఇక ఇప్పటివరకూ అల్లు అర్జున్ ఏ చిత్రం ఈ రేంజి ఫ్లాఫ్ కాలేదని ఆర్య 2 చాలా బెటరని అంటున్నారు. ఇదంతా గుణశేఖర్ తప్పిదమేనని అతన్ని బ్లేమ్ చేస్తున్నారు. అందులోనూ ఐదు రోజుల పెళ్ళి అక్కడా మంచి క్రేజ్ వచ్చిందని, అయితే చిత్రంలో అస్సలు దానిగురించే సరిగ్గా లేకపోవటం ఇబ్బందికి గురించేసిందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే గుణశేఖర్ మీద నిర్మాత మీదా చాలా గుర్రుగా ఉన్నారని, అంతటి ఎనర్జీ స్టార్ ని అలా డీలాగా చూపెట్టడం ఏం భావ్యమని అంటున్నారు. ఇక వరుడు చిత్రం ఓవర్ సీస్ బిజెనెస్ పై బాగా ఎఫెక్టు చూపెడుతుందని, రాబోయే చిత్రాలు ఆచి తూచి కొంటారని, రేటు బాగా తగ్గుతుందని ఇక్కడ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











