అల్లు అర్జున్ కేరళలో ఏం చేస్తున్నాడు?
ప్రస్తతం అల్లు అర్జున్ కేరళలోని అలెప్పీలో బిజీగా ఉన్నారు.ఆయకు అక్కడ ఏ తెలుగు హీరోకు లేనంత క్రేజ్ ఉంది. మలయాళంలోని పెద్ద హీరోలతో పోటీపడి మరీ అల్లు అర్జున్ డబ్బింగ్ చిత్రాలు అక్కడ ఓపినింగ్స్ సాధిస్తాయి. అల్లు అర్జున్ చేసే డాన్సులకు, ఫైట్స్‌కు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునో ఏమో, గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'వరుడు" చిత్రంలో కొంత భాగాన్ని కేరళలో చిత్రీకరిస్తున్నారు. కేరళలోని అలెప్పీలో అక్టోబర్ 28న మొదలై ఈనెల 10 వరకూ కొనసాగే ఓ భారీ షెడ్యూల్‌లో ఓ పాటతోపాటు కొన్ని పోరాటదృశ్యాలు చిత్రీకరిస్తారు.
ఈ షెడ్యూలు విశేషాలను నిర్మాత తెలియజేస్తూ, 'అక్టోబర్ 28న ప్రారంభమైన ఈ షెడ్యూలు నవంబర్ 10 వరకు జరుగుతుంది. ఈ షెడ్యూలులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. ఓ పాట కూడా చిత్రీకరిస్తాం. అద్భుతమైన సబ్జెక్ట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గుణశేఖర్ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మా బ్యానర్‌లో ఇది మరో ప్రతిష్ఠాత్మక చిత్రం అవుతుంది' అన్నారు. ఈ చిత్రం ద్వారా ఒక కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది. విలన్‌గా తమిళ హీరో ఆర్య నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: ఆంథోనీ, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.


Click it and Unblock the Notifications











