'వరుడు' డివైడ్ టాక్ తెచ్చుకున్నా... అల్లు అర్జున్
ఓవరాల్ గా 'వరుడు' చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయితే టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఉన్నాయి. నా చిత్రాలను యూత్ ఎక్కువగా చూస్తారు. ఈ సినిమాని ఫ్యామిలీస్ కూడా చూస్తున్నారు అంటున్నారు అల్లు అర్జున్. గురువారం అల్లు అర్జున్ జన్మదినం. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే...మొదటి వారంలో మా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.18.5 కోట్లను వసూలు చేసింది. నేను ఇంతవరకు చేసిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సినిమా ఇదే. సినిమా బాగుంది అని అన్నా వసూళ్ళు లేకపోతే నడవదు. అందుకే నా దృష్టిలో సినిమా విజయం లెక్కల మీదే ఆధారపడి ఉంటుంది. అవే మాట్లాడతాయి. ఓ నిర్మాత కొడుకుగా ఇలాగే ఆలోచిస్తాను అని తేల్చారు.
అయితే డివైడ్ టాక్ రావటానికి కారణం వివరిస్తూ...'టాక్' ఏముందండి? ఫైనల్‌గా లెక్కలోకొచ్చేది వసూళ్లే కదా. వరుడు సినిమా విడుదలయ్యాక భిన్న స్పందనలు వచ్చాయి. నన్ను అల్లరిచిల్లరిగా చూసిన యువత ఒక్కసారిగా ఇలాంటి చిత్రాన్ని జీర్ణించుకోలేకపోయింది. కానీ మొదటి నుంచీ మా లక్ష్యం కుటుంబ ప్రేక్షకులే. ఇప్పుడు ఆ వర్గం ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలను చూస్తున్నారు అన్నారు.
అయినా సినిమా బాగాలేదని టాక్ తెచ్చుకున్నా, వసూళ్లు బాగుంటే సక్సెస్ కిందే లెక్క. ఇవాళ సినిమా బాగాలేదన్నవాళ్లే వసూళ్లు బాగున్నాయని తెలుసుకుని, సినిమా బాగుందని మాట మార్చేస్తారు అని అల్లు అర్జన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











