శీలం గురించి నేను చెప్పిన..
శీలం గురించి నేను చెప్పిన డైలాగులకు మంచి స్పందన వచ్చింది. చాలా బాగా చెప్పారంటూ ఎంతో మంది అమ్మాయిలు నా బ్లాగ్‌కు మెయిల్స్ పంపిస్తున్నారు' అంటున్నాడు అల్లు అర్జున్. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మించిన 'వరుడు' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా చేసిన భానూ మెహ్రాను శనివారం హైదరాబాద్‌లో మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ పై విధంగా స్పందిచారం. అలాగే చిత్రం సక్సెస్ గురించి చెపుతూ..మొదట్లో డివైడ్ టాక్ ఉన్నా క్రమేణా ఫ్యామిలీస్ రావడం ఆనందంగా ఉంది. అలాగే సెకెండాఫ్ లో విలన్ ఆర్య నా పాత్రను డామినేట్ చేశారనే వాదన వినిపిస్తోంది. అది సరైనది కాదు.
విలన్ ఎంత శక్తివంతంగా ఉంటే, హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది అని అల్లు అర్జున్ అన్నారు. ఇక ఈ సినిమా పబ్లిసిటిలో భాగంగా హీరోయిన్‌ను రివిల్ చేయలేదు. ఎందుకంటే సినిమాలో హీరో కూడా చాలా సేపు ఆమెని చూడడు. కేవలం పెళ్లి పీటలమీదే చూస్తాడు. ప్రేక్షకులు కూడా అప్పుడే చూస్తే బాగుంటుందనే అభిప్రాయంతో హీరోయిన్ విషయం సస్పెన్స్‌గా ఉంచాం. ఇది సినిమాకు హైప్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ నా సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్లు ఈ సినిమా వసూలు చేసిందన్నారు. ఇక భానూ మెహ్రా మాట్లాడుతూ- "అమృతసర్‌లో పుట్టి పెరిగాను. ముంబైలో మాస్ మీడియా చేశాను. అల్లు అర్జున్, గుణశేఖర్ సినిమాతో పరిచయం కావడం నా అదృష్టం' అని తెలిపారు.


Click it and Unblock the Notifications











