సిద్దార్ధ కోసమే నా ఎదురుచూపు: వరుడు భానుశ్రీ మెహ్రా
తెలుగులో హీరో సిద్ధార్థ అంటే విపరీతమైన అభిమానం..అతని ఫ్యాన్ ని నేను. తనతో నటించడానికి ఎదురు చూస్తున్నా..అంటోంది వరుడు హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. ఆమె రీసెంట్గా బంజారాహిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే తనకు వరుడు లో ఛాన్స్ వచ్చిన విధానం వివరిస్తూ...కొంత కాలంగా ముంబైలో ఉంటూ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మోడలింగ్ చేస్తున్నా. 'వరుడు' కోసం హీరోయిన్ కావాలని నిర్మాతలు వెతుకుతున్నట్టు తెలిసి గుణశేఖర్‌ను సంప్రదించా. 250 మంది అమ్మాయిలు పోటీ పడగా నన్ను ఎంపిక చేయడం సంతోషం కలిగించింది అంటోంది భానుశ్రీ మెహ్రా.
ఇక తన స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ అని తండ్రి ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్టు వ్యాపారి అని భాను చెప్తోంది. అమ్మ సాధారణ గృహిణి, సొదరుడు ముంబైలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడని తన కుటుంబం గురించి చెప్పుకొచ్చింది. అలాగే నాన్‌వెజ్‌పై మోజు ఎక్కువ..హైదరాబాదీ బిర్యానీ, కబాబ్‌లంటే మక్కువ..ఈ సినిమాలో చేసిన సంప్రదాయ అమ్మాయి పాత్రలు అంటే ఇష్టం. బికినీ ధరించడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. హైదరాబాద్ రావడం వరుడు చిత్రంతో సాధ్యమైంది. కొత్త చిత్రాలపై చర్చలు జరుగుతున్నాయి, వివరాలు త్వరలో చెబుతా అంటూ భానుశ్రీ మెహ్రా తన తదుపరి ప్లాన్స్ గబగబా వివించేసింది.


Click it and Unblock the Notifications











