Varudu Kaavalenu : ప్రమోషన్లు ఇలా కూడా చేస్తారా? అందరి పెళ్లిళ్లకు వెళ్లి షాకిచ్చారుగా!
యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "వరుడు కావలెను". రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ "వరుడు కావలెను" సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది సినిమా యూనిట్. అయితే తాజాగా ఈ యూనిట్ చేసిన ప్రమోషన్ లు చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఫ్యామిలీ ఎంటర్టైనర్
నాగశౌర్య, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది.

దసరాకి అనుకున్నారు కానీ
ముందుగా ఈ సినిమాను అక్టోబర్ 15వ తేదీన దసరా సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు కానీ అదే రోజున రెండు సినిమాలు రిలీజ్ కోసం రెడీగా ఉండడంతో ఎందుకైనా మంచిది అని భావించి సినిమా విడుదల వాయిదా వేశారు. అలా అక్టోబర్ 29న విడుదల చేయడానికి ప్లాన్ చేసారు. ఇక ఈ 'వరుడు కావలెను' తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచారు.

జోరుగా ప్రమోషన్లు
ఇటీవల సంగీత్ ఈవెంట్ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ లాంచ్ ని క్రేజీ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డేతో చేయించిన టీమ్ ప్రచారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న హీరో నాగశౌర్య ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలడం లేదు అందులో భాగంగానే హైదరాబద్ లో ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు జరిగాయో ఆయా పెళ్లిళ్లకు వెళ్లి తమ చిత్ర ప్రచారం కోసం వాడేశారు.

పెళ్లిళ్లకు వెళ్లి
హీరో నాగశౌర్య.. హీరోయిన్ రీతూ వర్మ ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో జరిగిన కొన్ని పెళ్లి వేడుకలలో తళుక్కున మెరిశారు. అనార్కలీ డ్రెస్ లో రీతూ వర్మ.. సెమీ ఫార్మల్ డ్రెస్ లో హీరో నాగశౌర్య వెళ్లి పెళ్లి వేడుకలలో సందడి చేశారు. నూతన జంటలని జంటగా ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. యంగ్ హీరో అలాగే ఆయన యూనిట్ తమ సినిమా ప్రమోషన్ కోసం పెళ్లిని కూడా వదలడం లేదు కదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Recommended Video

భారీ అంచనాలతో
ఇక ఈ సినిమా మీద ముందు నుంచి మంచి అంచనాలున్నాయి. సినిమాలో నాగశౌర్య హీరోగా నటించడమే సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేసింది అని చెప్పచ్చు. అలాగే వరుస హిట్స్ అందుకుంటున్న సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తుండడంతో అంచనాలు పెరుగుతున్నాయి. మరి చూడాలి సినిమా ఏమేరకు జనాన్ని ఆకట్టుకుంటుంది అనేది..


Click it and Unblock the Notifications











