»   » బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌...ఇక్కడ మహేష్‌బాబు

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌...ఇక్కడ మహేష్‌బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ఎన్టీఆర్‌, మహేష్‌బాబు సినిమాలు చూస్తుంటాను. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌ ఎలాగో ఇక్కడ మహేష్‌బాబు అలాగా. రాజమౌళి అవకాశమిస్తే తెలుగులో తప్పక నటిస్తా అంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. అలాగే తనకు మహేష్ బాబు అంటే ప్రత్యేకమైన అభిమానమని చెప్పుకొచ్చారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్‌... అంటూ రెండేళ్ల కిత్రం వచ్చిన 'ఏబీసీడీ' బాక్సాఫీసు మంచి హిట్టైంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'ఏబీసీడీ 2' వస్తోంది. ఈ సారి వెండితెరపై డ్యాన్స్‌ చేస్తూ.. థియేటర్లలో ప్రేక్షకులతో డ్యాన్స్‌ చేయించడానికి హీరో,హీరోయిన్స్ వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌ సిద్ధమయ్యారు. వీరికి తోడుగా ఎలాగూ ప్రభుదేవా ఉన్నారు.

రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ గురువారం హైదరాబాద్‌ వచ్చింది. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

Varun Dhavan says he is a fan of Mahesh

చిత్రంలో తన పాత్ర గురించి చెప్తూ... ''సురేష్‌ అనే డ్యాన్స్‌ పిచ్చి ఉన్న ఓ మంచి కుర్రాడిగా కనిపిస్తాను. ఇందులో 20 రకాల డ్యాన్స్‌ ఫామ్స్‌ చూస్తారు. ప్రభుదేవాగారిలా చేయాలని చాలా ప్రయత్నించాను. కానీ కష్టమైంది. ఆయనతో నటించడం, డ్యాన్స్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఈ మధ్యే మణిరత్నం 'ఒకే బంగారం' చూశాను. చాలా నచ్చింది. దుల్కర్‌ సల్మాన్‌ బాగా చేశాడు. '' అని చెప్పుకొచ్చారు.

English summary
ABCD 2 , which is slated for release on June 19, features Varun Dhawan, Shraddha Kapoor and Prabhudeva in important roles.ABCD 2 marks the Bollywood debut of Telugu superstar Allu Arjun. Directed by Remo D'Souza, the film is the sequel to the sleeper hit ABCD: AnyBody Can Dance.
Please Wait while comments are loading...