‘బాహుబలి’ ప్రభాస్ తర్వాత ఈ హీరోకే ఆ ఛాన్స్.... (ఫోటోస్)
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు మేడమ్ టుస్సాడ్స్ ప్రత్యేక బృందం ముంబై వచ్చి వరుణ్ ధావన్ కొలతలు తీసుకున్నారు.
2017 సంవత్సరం బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్‌కు బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన వరుణ్ సినిమాలు 'బద్రినాథ్‌కి దుల్హనియా', జుడ్వా 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. సినిమా విజయానందంతలో ఉన్న వరుణ్ ధావన్‌కు మరో సంతోషకమైన వార్త అందింది.
సినీ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మ్యూజియమ్స్ కొలువుదీరుస్తున్న మేడమ్ టుస్సాడ్స్ వారు.... తాజాగా వరుణ్ ధావన్ విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇటీవల అతడిని కలిసిన ప్రత్యేక బృందం అతడి బాడీ కొలతలు తీసుకున్నారు. బాహుబలి ప్రభాస్ తర్వాత వరుణ్ ధావన్‌కే ఈ అవకాశం దక్కింది.

బాలీవుడ్ యంగ్ హీరోల్లో మొదటి వాడు
షారుక్, హృతిక్ రోషన్ లాంటి సీనియర్లు, స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.... బాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోల్లో మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరే అవకాశం దక్కించుకున్న మొదటి హీరో వరుణ్ ధావనే.

హాంకాంగ్ మ్యూజియంలో...
హాంకాంగ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వరుణ్ ధావన్ మైనపు విగ్రహం త్వరలో కొలువుతీరనుంది. ఇది నాకు చాలా గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అని, నా మైనపు విగ్రహాన్ని చూసుకునేందుకు చాలా ఎగ్జైట్మెంటుతో ఎదురు చూస్తున్నట్లు వరుణ్ ధావన్ తెలిపారు.

చాలా పెద్ద గౌరవం
చాలా పేరున్న ప్రముఖులకు మాత్రమే దక్కే అవకాశం నాకు ఇప్పుడే దక్కతం చాలా ఆనందంగా ఉంది, ఇది నాకు దక్కిన చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నట్లు వరుణ్ ధావన్ తెలిపారు.

విష్ చేసిన కరణ్ జోహార్
వరుణ్ ధావన్‌కు తన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమా ద్వారా తొలి హిట్ ఇచ్చిన ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా పంచుకుని విష్ చేశారు.

మేడమ్ టుస్సాడ్స్ టీం
వరుణ్ ధావన్ బాడీ కొలతలు తీసుకునేందుకు మేడమ్ టుస్సాడ్స్ నుండి ప్రత్యేక బృందం ముంబై వచ్చింది. 200లకు పైగా మెజర్మెంట్స్ తీసుకున్నారు. అతడి హెయిన్, ఐ కలర్ మ్యాచ్ అయ్యే విధంగా అన్నీ పర్ఫెక్టుగా కొలతలు తీసుకున్నారు.

వచ్చే ఏడాది ఆవిష్కరణ
హాంకాంగ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇప్పటి వరకు ఇండియా నుండి మహాత్మా గాంధీ, నరేంద్ర మోడీ, అమితాబ్ బచ్చన్ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. త్వరలో వీరి సరసన వరుణ్ ధావన్ చేరబోతున్నారు. వచ్చే ఏడాది ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగనుంది.


Click it and Unblock the Notifications











