యంగ్ హీరోకు మహిళా అభిమాని వేధింపులు, ఆత్మహత్య చేసుకుంటానంటూ...
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కు యువతి నుండి వేధింపులు ఎదురయ్యాయి. ఈ విషయమై వరుణ్ ధావన్ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ యువ నటుడు వరుణ్ ధావన్‌కు మహిళా అభిమాని నుండి వేధింపులు ఎదురయ్యాయి. ముంబైకి చెందిన ఓ యువతి వరుణ్ కు ఫోన్ చేస్తూ, మెసేజ్ లు పెడుతూ ఇబ్బందులు పెడుతుండటంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడటంతో...... ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హీరోలకు అభిమానులు ఉండటం సహజమే కానీ, సదరు అభిమాని ప్రవర్త తనను ఇబ్బందుల్లో పడేసేలా ఉండటంతో వరుణ్ ధావన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వందల్లో వాట్సాఫ్ మెసేజ్‌లు
వరుణ్ ధావన్ పర్సనల్ ఫోన్ నెంబర్ సంపాదించిన సదరు మహిళా అభిమాని వరుణ్ కు రోజూ వందల సంఖ్యలో వాట్సాఫ్ మెసేజ్‌లు చేసేది. తొలుత ఈ మెసేజ్ లను లైట్ తీసుకున్న వరుణ్... ఆమె హద్దులు దాటుతున్న విషయం గ్రహించి వార్నింగ్ ఇచ్చాడు.

నంబర్ బ్లాక్ చేసిన వరుణ్
అయితే ఎంత చెప్పినా సదరు మహిళా అభిమాని వినక పోవడంతో ఆమె నెంబర్ ను వరుణ్ ధావన్ బ్లాక్ చేశాడు. దీంతో మరో నెంబర్ ద్వారా అతన్ని వేధించడం మొదలు పెట్టింది.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు
ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన మరో వ్యక్తి వరుణ్‌కు ఫోన్ చేసి.... ఆమె మెసేజ్‌లకు రిప్లై ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటుందని బెదిరించారు. దీంతో వరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు ఏమంటున్నారు
వరుణ్ ధావన్ ఫిర్యాదు మీద పోలీసులు స్పందిస్తూ.... ఈ కేసును సైబర్ సెల్ విచారిస్తోందని, ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? అని కనుక్కునే ప్రయత్నం చేస్తుననామని, వారి ఫోన్ నెంబర్లు స్విచాఫ్ వస్తుననాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











