సమంతతో నటించొద్దని వార్నింగ్.. బ్లాక్ లిస్టులో సామ్.. బాంబు పేల్చిన యువ హీరో!
ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర మంచి స్టార్డం ఉన్న ప్రముఖ హీరోయిన్స్ లో పాన్ ఇండియా బ్యూటీ సమంత కూడా ఒకరు. మరి కెరీర్ పరంగా పర్శనల్ లైఫ్ పరంగా ఒక వారియర్ లా సమంత తన లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. కాగా సమంత తన హెల్త్ ఇష్యూతో ఇప్పటికీ బాధ పడుతుంది కానీ మళ్ళీ కెరీర్ ని సెట్ చేసుకోడానికి కెమెరా ముందుకు వచ్చింది.
ఇలా మళ్ళీ పలు భారీ వెబ్ సిరీస్ లు సినిమాలు మళ్ళీ రీస్టార్ట్ చేసిన సామ్ ఇపుడు మరోసారి ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ మధ్యలోనే సమంత హైదరాబాద్ రావడం కూడా తగ్గించేసింది అని అంతే కాకుండా తన బ్యానర్ మినహా ఏ సినిమా సంస్థతో కూడా సామ్ వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ గా లేనట్టే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సమంత నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఒకటి ఇపుడు ఓటిటిలో విడుదలకి రాబోతుంది.

కాగా ఆమె హిందీలో ది ఫ్యామిలీ మ్యాన్ 2 తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే లతో మళ్ళీ చేసిన మరో భారీ వెబ్ సిరీస్ నే "సిటాడెల్ హనీ బన్నీ". కాగా ఇది ఓ అమెరికన్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కించగా సమంత ఇందులో కీలక పాత్ర చేసింది. అయితే ఈమె సరసన బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ నటించాడు.
కాగా ఇద్దరు కూడా ఈ సిరీస్ లో అదరగొట్టినట్టుగా టీజర్, ట్రైలర్ లు చూస్తేనే అందరికీ అర్ధం అయ్యిపోయింది. అయితే ఈ సిరీస్ విషయంలోనే నాటుటడ్ వరుణ్ ధావన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను ఈ సిరీస్ చేసే ముందు సమంతతో కలిసి పని చెయ్యొద్దని చాలా ప్రెజర్స్ అప్పట్లో వచ్చాయట.

సమంతతో వర్క్ చెయ్యొద్దు వేరే బాలీవుడ్ హీరోయిన్ ని పెట్టుకొని చెయ్యి అని బీ టౌన్ కి చెందిన బిగ్ విగ్స్ చాలా మంది తనకి చెప్పినట్టుగా ఇటీవల బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూలో తాను రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో సామ్ విషయంలో బాలీవుడ్ లో కూడా ఓ సెక్షన్ బిగ్ విగ్స్ నెగిటివ్ గానే ఉన్నారని చెప్పాలి. మరి వారికి సామ్ ఏం అన్యాయం చేసిందో వారికే తెలియాలి.
కాగా ఈ అవైటెడ్ స్పై అండ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ అయితే పాన్ ఇండియా భాషల్లో ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది. అలాగే ఈ సిరీస్ తర్వాత తుంబాడ్ ఫేమ్ దర్శకుడు అనీల్ బార్వేతో ఈమె రక్త బ్రహ్మాండ్ అనే మరో బిగ్ సిరీస్ ని స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం వర్క్ చేస్తుంది. ఇలా ఈ రెండు సిరీస్ ల విషయంలో సమంత ప్రస్తుతం అయితే సీరియస్ గా వర్క్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











