కారు కాదు: త్రిష ఎంగేజ్ మెంట్ గిప్ట్ గురించి వరుణ్

By Srikanya

చెన్నై :త్రిష ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే నిశ్చితార్ధానికి ఆమె కాబోయే భర్త వరుణ్‌ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 7కోట్ల రూపాయల ఖరీదైన రోల్స్‌ రాయ్స్‌ కారును బహుమతిగా త్రిష అందుకోబోతుందని మీడియాలో గుప్పుమంది. అయితే ఈ విషయమై ఆమె కాబోయే భర్త వరుణ్ కొట్టి పారేస్తున్నారు. అలాంటిదేమీ లేదని అంటున్నారు. అంతేకాకుండా తాను ఇస్తున్న గిప్ట్ ని తెలియచేసాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుణ్ మణియన్ మాట్లాడుతూ... "గైస్, మీరు నిజంగా త్రిష ఎంగేజ్ మెంట్ గిఫ్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా. మేం ఈ ఎంగేజ్మెంట్ వీకెండ్ లో వేల కొద్ది జంతువులను షెల్టర్ ఇచ్చి, మెడికల్ ట్రీట్ మెంట్ ఇచ్చి పీడ్ చేయబోతున్నాం.. ఓ సంవత్సరం వరకూ...త్రిష రోల్స్ రాయస్ కారు కన్నా విలువలైన దీనికే ఎక్కువ విలువ ఇస్తుంది.కారు గిప్ట్ అనేది సిల్లీ రూమర్ మాత్రమే." ఇక త్రిష పెటా మెంబర్ అనే సంగతి తెలిసిందే.

తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష వివాహం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నెల 23న వీరి నిశ్చితార్థం జరగనుంది. ఈ వేడుక కోసం ఇరు కుటుంబాల వాళ్లు సన్నాహాలు మొదలుపెట్టారట. నిశ్చితార్థం వేడుక తేదీని ప్రకటించిన త్రిష వివాహ తేదీని మాత్రం ప్రకటించలేదు. ఈ నేపధ్యంలో త్రిష గత కొద్ది రోజులుగా దుబాయి లోనే గడపటం హాట్ టాపిక్ గా మారింది.

Varun reveals about engagement gift to Trisha

త్రిష...దుబాయి లో తన స్నేహితురాళ్లు అందరికీ బ్యాచులర్ పార్టీ కోసమే చెప్పుకుంటున్నారు. అయితే త్రిష మాత్రం అలాంటిదేమీ లేదని కేవలం కాస్ట్లీ డిజైనర్ అవుట్ ఫిట్ లు కొనుగోలు కోసమే వెళ్లానంటోంది. అయితే ఎంగేజ్ మెంట్ అయిన మరుసటి రోజు బ్యాచులర్ పార్టీ ఉందని,అది దుబాయిలోనే అని చెప్పుకుంటున్నారు.

మరో ప్రక్క త్రిష... వివాహ వేడుకను వినూత్న రీతిలో జరుపుకోపాలని మాత్రం అనుకుంటోందట. వరుణ్ మణియన్ బాగా డబ్బున్నవాడు. త్రిష కూడా కోట్లు సంపాదించింది. ఈ ఇద్దరూ తమ వివాహ వేడుక చాలా కొత్తగా ఉండాలనీ, ఓ తీపి అనుభూతిగా మిగిలిపోవాలని అనుకుంటున్నారట. అందుకే విమానంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కోలీవుడ్ టాక్.

ఫ్రెండ్స్‌తో కలిసి ప్రత్యేక విమానంలో తాజ్‌మహాల్‌కు తీసుకెళ్లిన వరుణ్‌ ఈ కారును గిఫ్ట్‌గా ఇవ్వడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది. అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ చెన్నైలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించి ఎవర్ని ఆహ్వానించలేదు.

కోరుకున్న ప్రియుడిని వివాహం చేసుకునేందుకు హీరోయిన్‌ త్రిష సిద్ధమైన సంగతి తెలిసిందే. మార్చిలో తమిళ నిర్మాత వరుణ్‌ మణియన్‌తో వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.

కొద్ది రోజుల క్రితం త్రిష, వరుణ్‌ నిశ్చితార్థంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. నిశ్చితార్థం జరగలేదని త్రిష కుటుంబ సభ్యులు అభిమానులను నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ వ్యహారం బయటకు పొక్కడంతో కోరుకున్న ప్రియుడుతో కలిసి త్రిష ఢిల్లీ, నేపాల్‌ టూర్లు వేసింది. తాజాగా వీరిద్దరికి మార్చిలో వివాహం చేయాలని త్రిష తల్లి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో బాగంగా ఆమె వరుణ్‌ (అల్లుడు) ఇంటికి వెళ్లి వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు తెలియవచ్చింది.

31 ఏళ్ల త్రిష ప్రేమ విషయం బయటకు వచ్చిన తర్వాత రెండు సినిమా ఆఫర్లు వెనక్కి వెళ్లిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరో బాలకృష్ణతో ‘లయన్‌', తమిళ్‌లో మరో చిత్రంలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. మరి వివాహం తరువాత త్రిష సినిమాల్లో నటిస్తుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది.

పెళ్లి తర్వాత కూడా త్రిష సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ‘నేను సినిమాలకు దూరం అవుతున్నట్లు ఏమీ చెప్పలేదు. మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం విడుదలయ్యే నా సినిమాలపై దృష్టి సారించాను' అని త్రిష స్పష్టం చేసింది.

తనకు కాబోయే తనకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటం, తన కోరికలను, అలవాట్లను అర్థం చేసుకునే వాడు కావడంతో ఆమె హ్యాపీగా ఉంది. ఇటీవలే అతనితో కలిసి నార్తిండియా టూర్ కూడా ఎంజాయ్ చేసింది త్రిష. కాబోయే భార్య త్రిష, ఆమె స్నేహితులను వరుణ్ మణియన్ లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో తీసుకెళ్లడం గమనార్హం. అంతా కలిసి ఆగ్రాలోని తాజ్ మహల్ తో పాటు ఢిల్లీలోని మరికొన్ని ప్రదేశాలు సందర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X