twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుణ్ సందేశ్ : ఎఫైర్స్..రూమర్స్...నిజాలు(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : శ్రద్ధాదాస్‌తో నాకు ఎఫైర్ వుందని పుకార్లు పుట్టించారు. గూగుల్‌లో వెతికితే కనిపించేంతగా నా మీద చాలా రూమర్లు వినిపించాయి. ఇలాంటి వార్తలు రాస్తున్నారేమిటి? అని మొదట్లో బాధపడేవాడిని. ఒకప్పుడు నేను, ఆమె మంచి ఫ్రెండ్స్. చాలా రోజుల తరువాత మేమిద్దరం ఈ మధ్యనే ఓ ఆడియో ఫంక్షన్‌లో కలిశాం. చిత్రపరిశ్రమలో నాకు చాలా మంది మిత్రులున్నారు. అందరిలాగే శ్రద్ధాదాస్ కూడా నాకు మంచి ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

    అలాగే...''విజయాన్ని ఎప్పుడూ నెత్తికెక్కించుకోలేదు. పరాజయాలకూ బాధ పడలేదు. అందుకే నేను నేనులానే ఉన్నా'' అంటున్నాడు వరుణ్‌ సందేశ్‌. 'హ్యాపీడేస్‌'తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడీ యంగ్ హీరో. 'కొత్తబంగారు లోకం'తో మరో విజయం అందుకొన్నాడు. 'ఏమైంది ఈ వేళ' తరవాత సరైన విజయాలు లేకపోయినా ఖాళీగా మాత్రం లేడు.

    గతేడాది వరుణ్‌ నటించిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఇప్పుడు 'నువ్వలా నేనిలా' విడుదలకు సిద్ధమైంది. 'లవకుశ', 'పడ్డానండీ ప్రేమలోమరి' చిత్రీకరణ దశలో ఉన్నాయి. సోమవారం వరుణ్‌ సందేశ్‌ పుట్టినరోజు.

    పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ...ఆయన చెప్పిన కొన్ని విశేషాలు... స్లైడ్ షోలో

    అది పూర్తిగా అబద్దం

    అది పూర్తిగా అబద్దం

    నేను పబ్బులకు వెళతారని, లేట్ నైట్ పార్టీల వల్ల షూటింగ్స్‌కి ఆలస్యంగా వెళుతుంటారనే వార్త ఉంది... పూర్తిగా అబద్ధం. అందుకు నిదర్శనం నా చేతిలో ఉన్న సినిమాలే. నా చేతిలో ఎప్పుడూ నాలుగైదు సినిమాలుంటాయి. పైగా, అపజయాల సంఖ్య ఎక్కువే ఉన్నా, నిర్మాతలు నాతో సినిమాలు తీయడానికి సుముఖంగా ఉన్నారు. నేనెంత సిన్సియర్‌గా ఉంటానో దాన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నా కారణంగా షూటింగ్స్‌కి ఆటంకం కలిగితే, నాతో ఎందుకు సినిమాలు తీస్తారు? నా గురించి ఎన్ని వదంతులు వచ్చినా, వాటిని నమ్మకుండా నాతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

    నా చేతిలో లేదు

    నా చేతిలో లేదు

    స్టార్ డెరైక్టర్‌తో ‘హ్యాపీడేస్' , ‘దిల్' రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ బేనర్‌లో ‘కొత్త బంగారు లోకం', ‘మరోచరిత్ర' చిత్రాలు చేసిన తర్వాత ఆ స్థాయి దర్శక, నిర్మాతలతో సినిమాలెందుకు చేయలేకపోయాను. ఎందుకనేది నా చేతుల్లో లేదు. నాకు వచ్చిన అవకాశాల్లో మంచి చిత్రాలను ఎన్నుకుని చేశాను. మొహమాటం కోసం కొన్ని సినిమాలు చేశాను. అసలు చెక్ తీసుకోకుండా చేసిన సినిమాలూ ఉన్నాయి. బాగున్న కొన్ని సినిమాలు సరైన ప్రచారం లేక ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే, ఈ మధ్యకాలంలో నా కెరీర్‌లో అపజయాల శాతమే ఎక్కువ.

    శేఖర్ కమ్ములతో మళ్లీ...

    శేఖర్ కమ్ములతో మళ్లీ...

    శేఖర్ కమ్ముల రూపొందించిన హ్యాపీడేస్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రాలు నాకు మంచి క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల వల్లే నా తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్లినా అందరూ ఈ రెండు సినిమాల గురించే మాట్లాడుతుంటారు. ఆ సినిమాలు లేకపోతే నేను లేను. హ్యాపీడేస్‌తో నాకు కొత్త జీవితాన్నిచ్చిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరోసారి నటించాలనుంది.

    అందుకే ప్లాప్ అవుతున్నాయి

    అందుకే ప్లాప్ అవుతున్నాయి

    చిన్న వయసులో హీరో కావడం...నా తొలి చిత్రానికి మంచిక్రేజ్ రావడంతో నా తదుపరి చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువయ్యాయి. డబ్బుల కోసం, మొహమాటం కోసం కొన్ని సినిమాలు చేశాను. ఆడుతాయి అనుకున్న కొన్ని సినిమాలు నిర్వహణ లోపం వల్ల పరాజయం పొందాయి. ఆ సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, భారీ అంచనాలు ఉండటంతో ప్రేక్షకులు అంతగా సంతృప్తిపడలేదు.

    అది నా నైజం కాదు

    అది నా నైజం కాదు

    చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి ఏడేళ్లవుతోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. హిట్టొస్తే గాల్లో తేలిపోవడం...ఫ్లాప్ వస్తే కుంగిపోవడం నా నైజం కాదు. హీరో అయ్యానని నేనెప్పుడూ ఫీలవలేదు. ఆ ఆలోచన నాకు రాకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం.

    మిగతా హీరోలతో పార్టీలు

    మిగతా హీరోలతో పార్టీలు

    పరిశ్రమలో నాకు చాలామంది స్నేహితులున్నారు. యువ హీరోలమంతా ఆడియో వేడుకల్లో సందడి చేస్తున్నాం కదా. మేం బయటా అలానే ఉంటాం. మా సినిమాలే కాదు, అందరి సినిమాలూ బాగా ఆడాలనే కోరుకొంటాం. రెండు వారాలకు ఒకసారైనా కలసి పార్టీలు చేసుకొంటాం. మేమంతా కలిస్తే ఆ సందడే వేరు.

    అన్యాయం చేయలేదు

    అన్యాయం చేయలేదు

    నా మీద దర్శకులకు, నిర్మాతలకు ఇంకా నమ్మకం ఉండడం నా అదృష్టం. కొన్ని సినిమాలు చెక్‌ల కోసం, ఇంకొన్ని చెప్పుకోలేక చేయాల్సి వస్తుంది. మొహమాటానికి ఒప్పుకున్న సినిమాలూ ఉన్నాయి. ఓ సినిమా బాగా ఆడినా, ఆడకపోయినా అదంతా సమష్టిగా స్వీకరించాల్సిందే. ఒకరివల్ల ఏమీ కాదు. నా సినిమాలు కొన్ని సరిగా ఆడకపోయినా.. అందులో కంటెంట్‌ బాగుండేది. నటుడిగా ఏ సినిమాకీ అన్యాయం చేయలేదు''.

    అది ఓ జమ్మిక్కు

    అది ఓ జమ్మిక్కు

    త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న నువ్వలా..నేనిలా విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సినిమాలో పూర్ణ కథానాయిక. ఇందులో మా ఇద్దరి మధ్య ఓ లిప్‌లాక్ సన్నివేశం వుంది. ఈ సీన్ కెమెరామెన్ జ్ఞానశేఖర్ చేసిన ఓ జిమ్మిక్కు. అదేంటో సినిమా చూస్తేనే అర్థమవుతుంది.

    ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

    ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు

    త్రినాథరావుగారి దర్శకత్వంలో చేసిన ‘నువ్వలా నేనిలా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం నా కెరీర్‌కి చాలా ప్లస్ అవుతుంది. అలాగే, ‘లవకుశ' అనే చిత్రం చేస్తున్నా. ఇందులో లవ, కుశ అనే రెండు పాత్రలు పోషిస్తున్నాను. ద్విపాత్రాభినయం అంత సులువు కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఇది కాకుండా ‘పడ్డానండి ప్రేమలో మరి'లో నటిస్తున్నా. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి

    English summary
    Varun Sandesh is celebrating his birthday on today the 21st July 2014.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X