Don't Miss!
- News కలలో శ్రీరామ దర్శనం.. మీ జీవితంలో ఊహించని అద్భుత ఫలితం
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
ఇద్దరు ప్రేయసిల మధ్య ‘ప్రియుడు’గా వరుణ్ సందేశ్
'వరుణ్ సందేశ్ కథానాయకుడిగా, 'అతిథి" ఫేమ్ అమృతారావు సోదరి ప్రీతికారావు, 'కొత్త బంగారులోకం" ఫేమ్ శ్వేతబసు ప్రసాద్ కథానాయికలుగా శ్రావణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రానికి 'ప్రియుడు" అనే టైటిల్‌ను నిర్ణయించారు. యుకె ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ' నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ విభిన్నమైన ప్రేమకథకు తగ్గట్టుగా 'ప్రియుడు" అనే టైటిల్ ను నిర్ణయించాం. ఇప్పటి వరకు నాలుగు పాటలు, కొంత టాకీ మినహా షూటింగ్ పూర్తయింది. బ్యాలెన్స్ గా వున్న పాటల్లో రెండు పాటలను ఈ నెల 25 నుంచి బ్యాంకాక్ లో చిత్రీకరించటానికి ప్లాన్ చేస్తున్నాం. మిగతా రెండు పాటలను హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్ ల్లో చిత్రీకరిస్తాం" అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ' యూత్ లవ్‌స్టోరితో పాటు కుటుంబ కథా చిత్రానికి కావాల్సిన అన్ని హంగులు ఈ చిత్రానికి వున్నాయి. నేటి తరానికి ప్రతినిధిగా వరుణ్ ఈ చిత్రంలో కనిపిస్తాడు" అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, నాజర్, కాశీ విశ్వనాథ్, అలీ, రణధీర్, వెన్నెల కిషోర్, విజయ్, ప్రభాస్ శ్రీను, మెల్కోటే, తాగుబోతు రమేష్, ప్రగతి, భావన, సురేఖావాణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మోహన్‌జోనా, పాటలు: చంద్రబోస్, వనమాలి, శక్తి, కేదరినాథ్, కూర్పు: మార్తాండ్.కె కళ: రాము, ఫైట్స్: గణేష్, కెమెరా: మల్హర్‌భట్, సమర్పణ: లక్ష్మీ, నిర్మాత: ఉదయ్‌కిరణ్, కథ-వూస్కీన్‌ప్లే-దర్శకత్వం-మాటలు: శ్రావణ్.