Don't Miss!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Automobiles కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
నీలకంఠ దర్శకత్వంలో యంగ్ హీరో ఖరారు
షో,మిస్సమ్మ వంటి చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న దర్సకుడు నీలకంఠ ఈ మధ్యన బాగా వెనకపడ్డారు. విరోధి చిత్రం ప్లాప్ అయినా విమర్శలు ప్రశంసలు అందుకోవటంతో ఇప్పుడు ఆయన మరో చిత్రం కమిటయ్యారు. వరుణ్ సందేశ్ హీరోగా ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. వరసగా ఫెయిల్యూర్ చిత్రాలు తీస్తున్న నిర్మాత డిఎస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇది ఒక రొమాంటిక్ చిత్రమని, ఓ విభిన్నమైన ప్రేమ కథను డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయనున్నానని నీలకంఠ చెప్తున్నారు. ఇక దర్శకుడు,నిర్మాత కలసి హీరోయిన్ సెర్చింగ్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రం కాకుండా వరుణ్ సందేశ్.. తెలుగులో పలు చిత్రాలకు డైలాగులు రచించిన నంధ్యాల రవి దర్సకత్వంలోనూ చేయబోతున్నాడు. ఇది పూర్తి స్ధాయి ప్రేమ కధా చిత్రమని తెలుస్తోంది.కుమార్ బ్రదర్శ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూర్తి కమర్షియల్ విలువతో నిండిన వినోదాత్మక ప్రేమ కధా చిత్రమని, త్వరలోనే షూటింగ్ మొదలుకానుందని నిర్మాతలు చెప్తున్నారు. ఇక గతంలో కుమార్ బ్రదర్శ్...సుమంత్ హీరోగా 'రాజ్" అనే చిత్రాన్ని వియన్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందించారు. ప్రియమణి, విమలారామన్ హీరోయిన్స్ గా చేసిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంకు ముందు ఈ నిర్మాతలు నా గర్లె ప్రెండ్ బాగా రిచ్, సాధ్యం సినిమాలు నిర్మించారు. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే అతను ప్రస్తుతం ప్రియుడు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వరుణ్ సందేశ్, ప్రీతికారావు, శ్వేతబసు ప్రసాద్ హీరో హీరోయిన్ లుగా రూపొందుతున్న చిత్రం 'ప్రియుడు". శ్రావణ్ దర్శకత్వంలో యుకె ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉదయ్ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.