హీరో వరుణ్ సందేష్ ‘దోపిడి’
హిందీలో '99', 'షోర్ ఇన్ సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మించబోతున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుటోంది. డిసెంబర్లో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.
మరో వైపు వరుణ్ సందేశ్ నటిస్తున్న 'చమ్మక్ చల్లో'చిత్రం కూడా విడుదలకు సిద్దం అవుతోంది. నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తుండగా, సంచిత పదుకోనే, కేథరిన్ హీరోయిన్‌లుగా పరిచయమవుతున్నారు. డి.ఎస్. రావు సమర్పణలో శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై మాస్టర్ బుజ్జిబాబు నిర్మిస్తున్నారు.
'చమ్మక్ చల్లో' నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకొచ్చాయనీ, త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామనీ, నవంబర్ మూడవ వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని సమర్పకులు డి.ఎస్. రావు తెలిపారు. అవసరాల శ్రీనివాస్, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, చిన్మయి, సురేఖావాణి తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: అనంత శ్రీరామ్, ఛాయాగ్రహణం: రంగనాథ్ గోగినేని, కూర్పు: నాగిరెడ్డి, కళ: బాబ్జీ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ.
మరో వైపు వరుణ్ సందేష్ 'అబ్బాయ్ క్లాస్...అమ్మాయి క్లాస్' చిత్రంలో కూడా నటిస్తున్నాడు. హ్యాపీ డేస్ తర్వాత ఆ రేంజి హిట్ లేక చిన్న హీరోగానే మిగిలిపోయిన వరుణ్ సందేష్ ఈ వరుస చిత్రాలతోనైనా గాడిలో పడతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












