ఎవరైనా..ఎప్పుడైనా..ఎప్పుడంటే...
వరుణ్ సందేశ్ లేటెస్ట్ ఫిలిం ఎవరైనా..ఎప్పుడైనా చిత్రం జూన్ ఆరున రిలీజుకి ప్లాన్ చేసారు. విమలా రామన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ద్వారా మార్తాండ శంకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఎవిఎమ్ వారు చాలా గ్యాప్ తర్వాత నిర్మిస్తున్నారు. ఇక వరుణ్ సందేశ్ వరస హిట్స్ హ్యాపీడేస్, కొత్త బంగారులోకం తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రం అనంతరం గుణ్ణం సందీప్ రూపొందిస్తున్న పొల్లాదవన్ రీమేక్ రిలీజు అవుతుంది. ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టే యోచనలో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఈ రెండూ తర్వాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మరో చరిత్ర రీమేక్ రెడీ అవుతుంది.
varun sandesh happy days kotha bangaru lokam box office manisharma vijetha ఎవరైనాఎప్పుడైనా వరుణ్ సందేశ్ పొల్లాదవన్ రీమేక్ మరో చరిత్ర మణిశర్మ ఎవిఎమ్


Click it and Unblock the Notifications