గీతా ఆర్ట్స్ లో వరుణ్ సందేశ్, తమన్నా
ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ లో హ్యాపీడేస్ జంట వరుణ్ సందేశ్,తమన్నా నటించనున్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. వచ్చే నెలలో చిత్రీకరణ మొదలవుతుంది. ఈ విషయాలను సుకుమారే మీడియాకు స్వయంగా చెప్పారు. ఇక ఈ చిత్రం బావా, మరదలు మద్య జరిగే కథగా తెరకెక్కనుందని సమాచారం. ఇక సుకుమార్ తాజాగా తీసిన ఆర్య-2 చిత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మెరుగ్గానే ఉందని తెలుస్తోంది. అలాగే వరుణ్ సందేశ్..లెటెస్ట్ చిత్రం కుర్రాడు కూడా ఫ్లాఫ్ టాక్ ని తెచ్చుకుంది. తమిళంలో హిట్టయిన పొల్లాదవాన్ రీమేక్ ఇక్కడ వర్కవుట్ కాలేదు. అంతకుముందే ఇదే బైక్ కాన్సెప్ట్ తో రైడ్ చిత్రం రావటం ఈ చిత్రం దెబ్బతినటానికి మెయిన్ కారణమని తేల్చారు. ఇక తమన్నా తెలుగు కన్నా తమిళంలో బిజీగా ఉంది. ఆమె తాజా చిత్రం భరత్ కాంబినేషన్ లో జయ్ వుయ్ మెట్ రీమేక్ గా రూపొందింది. అయితే నేటివిటీ సమస్యతో ఈ చిత్రం అక్కడ వారిని ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ ముగ్గురూ మంచి కసితో నెక్ట్స్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి మంచి ప్రొడక్టే వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











