ఉదయ్ కిరణ్, తరుణ్ రూటులోకి జారుతున్న వరుణ్ సందేశ్?
ప్రస్తుతం వరుణ్ సందేశ్ పొజీషన్ ఆల్రెడీ ఫేడవుట్ అయిన ఉదర్ కిరణ్, తరుణ్ లాంటిదే అంటున్నారు. ఉదయ్ కిరణ్, తరణ్ ఇద్దరూ కెరీర్ ప్రారంభంలో టీనేజర్స్ ని ఎట్రాక్ట్ చేసే సినిమాలు(చిత్రం, నువ్వు నేను, నువ్వే కావాలి,నువ్వు లేక నేను లేను) చేసి హిట్ కొట్టారు. ఆ తర్వాత ఆ గ్లామర్ కంటిన్యూగా వర్కవుట్ కాక, ఎక్కడెక్కడి పాచి కథలూ ఒప్పుకుని డిజాస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడదే రూటులో వరుణ్ సందేశ్ ప్రయాణం పెట్టుకున్నాడు. మరో ప్రక్క మొదట్లో రెండు హిట్స్ ఇవ్వటంతో వరణ్ సందేశ్ మరో మాట లేకుండా తన రెమ్యునేషన్ ని డెబ్బై ఐదు లక్షలకు పెంచాడు. అయితే ఆ తర్వాత వచ్చిన కుర్రాడు, ఎవరైనా ఎపుడైనా, మరో చరిత్ర ప్లాప్ కావటంతో వరుణ్ సందేశ్ కి డిమాండ్ చేసే సిట్యువేషన్ పోయింది. ఈ లోగా దెబ్బ మీద దెబ్బ అన్నట్లు హ్యాపీ డేస్ తర్వాత వెంటనే ఒప్పుకున్న హ్యాపీ హ్యాపీగా చిత్రం కంప్లీటై ఈ వారం ధియోటర్లోకి దిగి డిజాస్టర్ అయింది. దాంతో వరుణ్ సందేశ్ కి ఏమీ తోచని స్ధితి ఏర్పాటు చేసింది. కథ సరిగ్గా చూసుకోకుండా కేవలం తన ఇమేజ్ నే నమ్ముకుని టీనేజర్స్ ని ఎట్రాక్ట్ చేసి హిట్ కొట్టచ్చు అనే ఆలోచనే వరణ్ ని దెబ్బతీసిందంటున్నారు. ఇప్పుడు పాతిక లక్షలుకు కూడా వరుణ్ దొరికేస్తాడంటున్నారు. అందులోనూ రామానాయుడు బ్యానర్ లో ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం అనుకున్నారు. అది కూడా ఆగిపోయి ఆ స్లాట్ లోకి నిఖిల్, దర్శకుడు చంద్రమహేష్ వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసేసారు. కాబట్టి ఇకనైనా వరణ్ సినిమా ఒప్పుకునేటప్పుడు తన మీద నమ్మకం కన్నా కధ మీద దృష్టిపెడితే నిలబడతాడనేది అందరూ ఒప్పుకునే నిజం.


Click it and Unblock the Notifications











