వరుణ్ సందేష్ కీ ఆ పిచ్చి

By Staff

Varun Sandesh
తమిళ హిట్ పొల్లాదవాన్ ని రీమేక్ లో వరుణ్ సందేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కోసం వరుణ్ సందేష్ త్వరలో సిక్స్ పాక్ తో కన్పించునున్నాడు. అయితే హ్యాపీడేస్,కొత్త బంగారు లోకం సినిమాలతో యువతలో క్రేజ్ తెచ్చుకున్న చేస్తున్న ఈ హీరో సిక్స్ పాక్ సంపాదించి యాక్షన్ హీరోగా మారితే టీనేజ్ లవ్ స్టోరీ ఆఫర్స్ వస్తాయా అన్నది సందేహపడుతున్నాడని సమాచారం. అయితే గుణ్ణం గంగరాజు గారి కుమారుడు గుణ్ణం సందీప్ ఆ చిత్రానికి దర్శకుడు కావటంతో అతనే ధైర్యం చెప్పి సిక్స్ పాక్ ట్రై చేయమన్నాడని సమాచారం.

ప్రస్తుతం వరుణ్ ఎవియం వారకి ఎవరైనా..ఎపుడైనా చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. పొల్లాదవాన్ రీమేక్ ని జెమినీ వారు రైట్స్ తీసుకుని నిర్మిస్తున్నారు. ఏదెలా ఉన్నా వరుణ్ త్వరలో సూర్య,అమీర్ ఖాన్,అల్లు అర్జున్ తరహాలో చొక్కా విప్పి తన కండల ప్రదర్శన చేస్తాడన్నమాట.అలాగే అతను క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంటున్నాడని వినికిడి. కెరీర్ కోసం కష్టపడటానికి రెడీ అవుతున్న వరుణ్ మరెన్ని హిట్స్ సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X