ఆ ఫ్లాప్ సినిమా వారం గడిస్తే పెద్ద హిట్ అవుతుందా?
సినిమాకు మొదటి వారం కన్నా ఇప్పుడు మరిన్ని కలెక్షన్లున్నాయి. ముందు ముందు మా చిత్రం పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అంటున్నారు హ్యాపీ హ్యాపీ గా చిత్రం టీమ్. వరుణ్ సంధేశ్, వేగ, శరణ్యా మోహన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం రెండు వారాల క్రితం రిలీజు అయింది. ఈ చిత్రం రిలీజైన రోజే ప్లాప్ టాక్ తెచ్చుకుని ప్రేక్షక నిరాదరణకు గురి అయింది.అయితే దర్శక, నిర్మాతలు మాత్రం మెల్లిమల్లిగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి..వారం గడిస్తే గ్యారింటీ హిట్ అవుతుందంటున్నారు.
ఈ విషయం చెప్పటానికి ఈ చిత్రం టీమ్ ..సక్సెస్ మీట్ ఎరేంజ్ చేసారు. ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ" మణిశర్మ స్వరపరిచిన బాణీలు, సీతారామశాస్త్రి సాహిత్యం సినిమాకి ఎస్సెట్. నగరం నేపథ్యంలో ఫీల్‌గుడ్ మూవీగా దీన్ని తయారుచేశాం. రెండో వారం నుంచి కలెక్షన్లు చాలా బాగున్నాయి. ఈ నెల 2 నుంచి 6 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు థియేటర్లకు మా యూనిట్ మొత్తం వెళ్తున్నాం. అలీ పాత్రకు మంచి స్పందన వస్తోంది" అని చెప్పారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు అందరూ హాయిగా ఉన్నారు" అని అన్నారు. రంజిత్ మూవీస్ సమర్పిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రియాశరణ్ దర్శకునిగా పరిచయమయ్యారు.


Click it and Unblock the Notifications











